T20 Rankings: ఐసీసీ టీ 20 లేటెస్ట్ ర్యాంకింగ్స్.. టాప్-10లో టీమిండియా నుంచి ఒకే ఒక్కడు..
ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ 838 పాయింట్లతో ర్యాంకింగ్ లిస్టులో 2వ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం రిజ్వాన్, సూర్యకుమార్ యాదవ్ మధ్య పాయింట్ల తేడా కేవలం 23 మాత్రమే. టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపిస్తే అగ్రస్థానానికి చేరుకోవచ్చు.
ICC కొత్త T20 ర్యాంకింగ్ జాబితాను ప్రచురించింది. ఈసారి కూడా పాకిస్థాన్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ 861 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే దక్షిణాఫ్రికాపై అదరగొట్టిన టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ పాక్ బ్యాటర్‌కు గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ 838 పాయింట్లతో ర్యాంకింగ్ లిస్టులో 2వ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం రిజ్వాన్, సూర్యకుమార్ యాదవ్ మధ్య పాయింట్ల తేడా కేవలం 23 మాత్రమే. టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపిస్తే అగ్రస్థానానికి చేరుకోవచ్చు. ఇక పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (808) మూడో స్థానంలో కొనసాగుతుండగా.. మార్క్రమ్, డెవాన్ కాన్వే, డేవిడ్ మలాన్, ఫించ్, నిస్సంక, ముహ్మద్ వసీమ్, గ్లెన్ ఫిలిప్స్ వరుసగా 4 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు.
మరి టీ20 ర్యాంకిగ్స్‌లో టాప్-10 బ్యాటర్లు ఎవరంటే?
1. మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్) – 861 2. సూర్యకుమార్ యాదవ్ (ఇండియా) – 838 3. బాబర్ ఆజం (పాకిస్తాన్) – 808 4. ఐడెన్ మార్క్రామ్ (దక్షిణాఫ్రికా) – 777 5. డెవాన్ కాన్వే (న్యూజిలాండ్) – 773 6. డేవిడ్ మలన్ (ఇంగ్లండ్) – 765 7. ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) – 688 8. పాతుమ్ నిసంక (శ్రీలంక) – 681 9. మొహమ్మద్ వాసిమ్ (UAE) – 612 10. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్) – 611
ఇక బౌలింగ్ విషయానికొస్తే.. హేజిల్‌వుడ్, రషీద్ ఖాన్, హసరంగ, షంషి మొదటి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఐదో స్థానానికి ఎగబాకగా.. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్.. ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని ఎనిమిదిలో నిలిచాడు. టీమిండియా బౌలర్లలో భువీ 12లో, అశ్విన్, అక్షర్ వరుసగా 22, 23 స్థానాల్లో నిలిచారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..