T20 World Cup: టీమిండియా సెమీస్ చేరడం కష్టమే.. బాంబ్ పేల్చిన మాజీ సారథి.. కారణం అదేనంట..
Team India: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో ఆడాల్సి ఉంది. దీపావళికి ఒకరోజు ముందు ఈ మ్యాచ్ జరగనుంది.
భారత జట్టు తన టీ20 ప్రపంచ కప్ 2022 మిషన్‌ను వార్మప్ మ్యాచ్‌లతో ఘనంగా ప్రారంభించింది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ను ఆస్ట్రేలియా ఓడించింది. అయితే, రెండో మ్యాచ్ న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉండగా, వర్షంతో అది రద్దైంది. ఈసారి ప్రపంచకప్ టైటిల్ కోసం టీమ్ ఇండియాను పోటీదారుగా పరిగణిస్తున్నారు. అయితే 1983 ప్రపంచకప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ మాత్రం ఊహించని విధంగా జోస్యం చెప్పి షాక్ ఇచ్చాడు. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరడం కష్టమేనంటూ కపిల్ దేవ్ జోస్యం చెప్పాడు. టీమిండియా సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. భారత జట్టు టాప్-4కు చేరే అవకాశాలు కేవలం 30% మాత్రమే అని తెలిపారు. అయితే ఈ అంచనా ఎందుకు వచ్చిందో కూడా కపిల్ వెల్లడించాడు. ఆయనెమన్నారో చూద్దాం..
మ్యాచ్ గెలవాలంటే ఆల్ రౌండర్లు తప్పనిసరి..
ప్రపంచ కప్ ఛాంపియన్ సారథి కపిల్ దేవ్ లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘ప్రపంచకప్‌లోనే కాకుండా ఇతర టోర్నమెంట్‌లు లేదా సిరీస్‌లలో కూడా మ్యాచ్‌లు గెలవాలంటే మాత్రం కచ్చితంగా జట్టులో ఆల్‌రౌండర్‌లు ఉండాలి. హార్దిక్ పాండ్యా లాంటి క్రికెటర్ భారత్‌కు ఎంతగానో ఉపయోగపడతాడు.
కపిల్ దేవ్ మాట్లాడుతూ, ‘ఏ జట్టుకైనా ఆల్ రౌండర్లు కీలక ఆటగాళ్లు. వాళ్లే జట్టుకు బలం. హార్దిక్ లాంటి ఆల్ రౌండర్ రోహిత్ శర్మ (కెప్టెన్)ని ఆరో బౌలర్‌గా ఉపయోగించుకునే స్వేచ్ఛను ఇస్తాడు. అతను మంచి బ్యాట్స్‌మెన్, బౌలర్‌తోపాటు ఫీల్డర్‌గా కూడా పనిచేస్తాడు. రవీంద్ర జడేజా కూడా టీమ్ ఇండియా పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ అని తెలిపారు.
టాప్-4కు చేరిన తర్వాతే.. టైటిల్ గురించి మాట్లాడదాం..
ముందుగా భారత జట్టును సెమీఫైనల్‌కు చేరాలని, ఆ తర్వాతే టైటిల్ గెలుస్తామా లేదా అన్న విషయంపై మాట్లాడాలని అన్నారు. కపిల్ డెల్ మాట్లాడుతూ, ‘మా రోజుల్లో కూడా టీమ్ ఇండియాలో చాలా మంది ఆల్ రౌండర్లు ఉన్నారు. టీ20 క్రికెట్‌లో, ఒక జట్టు ఒక మ్యాచ్‌లో గెలిస్తే, మరొసారి ఓడిపోవచ్చు… ఇటువంటి పరిస్థితిలో, భారత జట్టు ప్రపంచకప్‌ను గెలుచుకునే అవకాశాల గురించి మాట్లాడటం అర్థరహితం అంటూ చెప్పుకొచ్చారు.
కపిల్ దేవ్ మాట్లాడుతూ, ‘టీమిండియా టాప్-4లో చేరగలదా అనేది సమస్య కావచ్చు? భారత జట్టు టాప్-4కు చేరుకోవడంపై నేను ఆందోళన చెందుతున్నాను. అప్పుడే ఫైనల్ గురించి మాట్లాడదాం. నా అభిప్రాయం ప్రకారం, భారత జట్టు టాప్-4కు చేరుకునే అవకాశాలు 30% మాత్రమే’ అంటూ చెప్పుకొచ్చారు.
తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తో..
ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు (ఫస్ట్ రౌండ్) జరుగుతున్నాయి. అక్టోబరు 23న పాకిస్థాన్‌తో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. దీపావళికి ఒకరోజు ముందు ఈ మ్యాచ్ జరగనుంది.
సూపర్-12లో భారత జట్టు గ్రూప్-బిలో చేరింది. ఈ గ్రూప్‌లో టీమిండియాతో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా కూడా ఉన్నాయి. క్వాలిఫైయింగ్ రౌండ్ తర్వాత రెండు జట్లు ఈ గ్రూప్‌లోకి ప్రవేశిస్తాయి. క్వాలిఫయింగ్ రౌండ్‌లో గ్రూప్-2 విజేత, గ్రూప్-1లో రన్నరప్‌గా నిలిచిన జట్టు ఈ గ్రూప్-బిలో చోటు దక్కించుకుంటుంది.
టీ20 ప్రపంచకప్ 2022కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికె), దినేష్ కార్తీక్ (వికె), హార్దిక్ పాండ్యా, ఆర్.కె. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ షమీ.
స్టాండ్‌బై ఆటగాళ్లు: శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.