ICC Rankings: కింగ్ కోహ్లీకి షాకిచ్చిన యంగ్ ప్లేయర్.. దెబ్బకు ప్లేస్ ఛేంజ్.. టాప్ 10లో ఒక్కడే..
Harry Tector: యూఏఈతో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టెక్టర్ ఐసీసీ కొత్త ర్యాంకింగ్స్‌లో 7వ స్థానానికి చేరుకుని, కోహ్లీ స్థానానికి ఎసరు పెట్టేశాడు.

ఇటీవల విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ఆడుతున్న జట్ల ఆటగాళ్లు లక్కీ ఛాన్స్ పట్టేశారు. యూఏఈతో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన ఐర్లాండ్ ఆటగాడు హ్యారీ టెక్టర్ ఐసీసీ కొత్త ర్యాంకింగ్స్‌లో 7వ స్థానానికి ఎగబాకాడు. యూఏఈపై కేవలం 33 బంతుల్లోనే 57 పరుగులు చేసిన 23 ఏళ్ల హ్యారీ టెక్టర్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఎగబాకడమే కాకుండా కింగ్ కోహ్లీని అధిగమించాడు. అతనితో పాటు విండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రాజా వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో లాభపడ్డారు.
కొత్త వన్డే ర్యాంకింగ్స్ ప్రకారం, ఐర్లాండ్‌కు చెందిన హ్యారీ టెక్టర్ టెక్టర్ తన మునుపటి 9వ స్థానం నుంచి రెండు స్థానాలు ఎగబాకాడు. అంటే 7వ స్థానానికి చేరుకున్న టెక్టర్.. కోహ్లీ స్థానాన్ని ఆక్రమించాడు.
టెక్టర్ ఇప్పుడు 723 రేటింగ్ పాయింట్లతో 7వ స్థానంలో ఉండగా, కింగ్ కోహ్లీ 8వ స్థానంలో ఉన్నాడు. అలాగే, దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్ ర్యాంకింగ్‌లో టెక్టర్ పదోన్నతి పొందడంతో 9వ స్థానానికి పడిపోయాడు.




వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ కూడా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో రెండు సెంచరీలతో ర్యాంకింగ్స్‌లో భారీ లాభాలను సాధించాడు. ర్యాంకింగ్స్‌లో 13 స్థానాలు ఎగబాకిన పూరన్, అలెక్స్ కారీ, టామ్ లాథమ్, జో రూట్‌లతో కలిసి సంయుక్తంగా 19వ స్థానంలో ఉన్నాడు.
కాగా, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా బ్యాటింగ్, ఆల్ రౌండర్ విభాగాల్లో తన స్థానాన్ని మార్చుకున్నాడు. ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో సెంచరీ సాధించిన రజా ఏడు స్థానాలు ఎగబాకి 27వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే టోర్నీలో ఎనిమిది వికెట్లు తీసిన రజా ఆల్ రౌండర్ల జాబితాలో రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




