AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ‘బాబర్ జట్టులో అంతా జీరో ఫిట్‌నెస్ ఆటగాళ్లే’: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్

World Cup 2023: ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను ఓడించడం ద్వారా భారత్ తన అజేయ పరంపరను కొనసాగించింది. 1992 నుంచి 2003 వరకు ఇరు జట్లు 8 సార్లు తలపడగా మొత్తం ఎనిమిది సార్లు టీమ్ ఇండియా గెలిచింది. భారత్ ఇప్పుడు పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అక్టోబర్ 19 న బంగ్లాదేశ్‌తో తలపడగా, అక్టోబర్ 20న బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది.

IND vs PAK: 'బాబర్ జట్టులో అంతా జీరో ఫిట్‌నెస్ ఆటగాళ్లే': పాక్ మాజీ కెప్టెన్ ఫైర్
India Vs Pakistan
Venkata Chari
|

Updated on: Oct 16, 2023 | 3:35 PM

Share

World Cup 2023, India vs Pakistan: అక్టోబర్ 14, 2023న శనివారం ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్టు తలపడ్డాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టు (India vs Pakistan) ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మేరకు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ బాబర్ ఆజం జట్టును లక్ష్యంగా చేసుకున్నాడు. తన కాలంలో ‘సుల్తాన్ ఆఫ్ స్వింగ్’గా పేరుగాంచిన అక్రమ్, రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టుపై పాకిస్తాన్ పేలవమైన ప్రదర్శన వెనుక పేలవమైన ఫిట్‌నెస్ ఒక కారణమని పేర్కొన్నాడు. పాక్‌ జట్టు ఆటగాళ్లకు ఎలాంటి ఫిట్‌నెస్‌ పరీక్ష చేయలేదంటూ విమర్శలు గుప్పించారు.

పాకిస్థాన్ టీవీ షోలో వసీం అక్రమ్ మాట్లాడుతూ, “ఈ ఆటగాళ్ల ఫిట్‌నెస్ గురించి నేను ఆందోళన చెందుతున్నాను. వీరికి ఎటువంటి ఫిట్‌నెస్ పరీక్ష లేదు. మిస్బా-ఉల్-హక్ కోచ్, సెలెక్టర్‌గా ఉన్నప్పుడు, అతను యో-యో టెస్ట్, ఇతర పరీక్షలను నిర్వహించేవాడు. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ కనీసం నెలకు ఒకసారి ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకోవాలి. మీరు దీన్ని చేయకపోతే, ఇలానే (భారత్‌తో ఓటమి) అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

గత మూడేళ్లలో ముగ్గురు చైర్మన్‌లను మార్చిన పీసీబీ..

వసీం అక్రమ్ మాట్లాడుతూ, “గత 3 సంవత్సరాలలో పీసీబీ 3 చైర్మన్లను చూసింది. దీంతో జట్టు సభ్యులు, మేనేజ్‌మెంట్‌లో తదుపరి సిరీస్‌లో భాగమవుతామా లేదా అనే భయం నెలకొంది. 154 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన దశలో పాకిస్తాన్ టీం.. 191 పరుగులకు ఆలౌట్ కావడం నిజంగా నిరాశపరిచింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై 8-0 ఆధిక్యంలో భారత్..

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను ఓడించడం ద్వారా భారత్ తన అజేయ పరంపరను కొనసాగించింది. 1992 నుంచి 2003 వరకు ఇరు జట్లు 8 సార్లు తలపడగా మొత్తం ఎనిమిది సార్లు టీమ్ ఇండియా గెలిచింది. భారత్ ఇప్పుడు పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అక్టోబర్ 19 న బంగ్లాదేశ్‌తో తలపడగా, అక్టోబర్ 20న బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
బంగారం వెండి కంటే ఖరీదైన 'ఎర్రబంగారం'.. వీటిని కలలో కూడా కొనలేం!
బంగారం వెండి కంటే ఖరీదైన 'ఎర్రబంగారం'.. వీటిని కలలో కూడా కొనలేం!
సంక్రాంతి రద్దీతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడి.. హద్దు మీరితే అంతే
సంక్రాంతి రద్దీతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడి.. హద్దు మీరితే అంతే
మనుషులు ఎందుకు దండగా.. ఏఐ ఉండగా..
మనుషులు ఎందుకు దండగా.. ఏఐ ఉండగా..
ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా రొమాంటిక్ రీల్ వైరల్
ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా రొమాంటిక్ రీల్ వైరల్
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్‌పై బిగ్ అప్డేట్
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్‌పై బిగ్ అప్డేట్
బాయిలోన బల్లి పలికే పాటకు ఎంత ఇచ్చారంటే.. సింగర్ నాగవ్వ..
బాయిలోన బల్లి పలికే పాటకు ఎంత ఇచ్చారంటే.. సింగర్ నాగవ్వ..