హైదరాబాద్‌కు ఐపీఎల్‌ ఫైనల్‌ ఛాన్స్!

ఐపీఎల్‌లో భాగంగా వచ్చే నెల 12న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ చెన్నైలో నిర్వహించడంపై  బీసీసీఐ సందిగ్దంలో పడింది. దీనిలో భాగంగా తుది పోరు కోసం హైదరాబాద్‌ను స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. గతేడాది రన్నరప్‌గా సన్‌రైజర్స్‌ నిలిచిన విషయం తెలిసిందే. అలాగే ప్లేఆఫ్స్‌, ఎలిమినేటర్‌ మ్యాచ్‌ల కోసం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియాన్ని స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. వాస్తవానికి డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు చెందిన సొంత మైదానంలో ఆరంభ, ముగింపు మ్యాచ్‌లను జరపడం ఆనవాయితీగా వస్తోంది. దీని ప్రకారం ఆరంభ మ్యాచ్‌ […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:21 pm, Tue, 9 April 19
హైదరాబాద్‌కు ఐపీఎల్‌ ఫైనల్‌ ఛాన్స్!

ఐపీఎల్‌లో భాగంగా వచ్చే నెల 12న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ చెన్నైలో నిర్వహించడంపై  బీసీసీఐ సందిగ్దంలో పడింది. దీనిలో భాగంగా తుది పోరు కోసం హైదరాబాద్‌ను స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. గతేడాది రన్నరప్‌గా సన్‌రైజర్స్‌ నిలిచిన విషయం తెలిసిందే. అలాగే ప్లేఆఫ్స్‌, ఎలిమినేటర్‌ మ్యాచ్‌ల కోసం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియాన్ని స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. వాస్తవానికి డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు చెందిన సొంత మైదానంలో ఆరంభ, ముగింపు మ్యాచ్‌లను జరపడం ఆనవాయితీగా వస్తోంది. దీని ప్రకారం ఆరంభ మ్యాచ్‌ చెన్నైలో జరగ్గా ఫైనల్‌ కూడా అక్కడే నిర్వహించాల్సి ఉంటుంది. కానీ చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో 12వేల సామర్థ్యం కలిగిన ఐ,జే,కే స్టాండ్స్‌లోకి 2012 నుంచి ప్రేక్షకులను అనుమతించడం లేదు. వీటికి స్థానిక కార్పొరేషన్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ను ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. ఇక ఇదే పరిస్థితి ఈ ఏడాది కూడా కొనసాగితే తుది పోరు హైదరాబాద్‌‌లో జరగనుంది.