IPL 2025: అంతా బాగే ఉంది కానీ.. హేజిల్‌వుడ్, సాల్ట్ గాయంపై ఆందోళనలో RCB ఫ్యాన్స్! అప్డేట్ ఇచ్చిన DK
ఆర్సీబీకి కీలకమైన జోష్ హేజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్ గాయాల వల్ల సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యారు. అయితే, మే 9న ఎల్ఎస్జీతో జరిగే కీలక మ్యాచ్‌కు ఈ ఇద్దరూ అందుబాటులోకి రానున్నారని మెంటార్ దినేశ్ కార్తిక్ తెలిపారు. హేజిల్‌వుడ్ ఇప్పటి వరకు 18 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఫిల్ సాల్ట్ పవర్ ప్లేలో విధ్వంసకర ఆటతీరు చూపించినా, జ్వరంతో బాధపడుతూ వరుసగా రెండో మ్యాచ్‌కు దూరమయ్యాడు.

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్సీబీ తరఫున జోష్ హేజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన ఆటగాళ్లుగా నిలిచారు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో జరిగిన మ్యాచ్‌ను ఈ ఇద్దరు విదేశీ స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా వదిలిపెట్టారు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ ఒక చిన్న మార్జిన్‌తో గెలుపొందింది. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్ అనంతరం ఆర్సీబీ మెంటార్ దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ, మే 9న జరిగే లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో మ్యాచ్‌కు వీరిద్దరూ తిరిగి అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నామని తెలిపారు. హేజిల్‌వుడ్, సాల్ట్ ఇద్దరూ వచ్చే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాం, అని కార్తిక్ స్టార్ స్పోర్ట్స్‌కి తెలిపారు.
హేజిల్‌వుడ్ పరిస్థితి
హేజిల్‌వుడ్ ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లలో 18 వికెట్లు తీసి ఆర్సీబీకి కీలక బౌలర్‌గా నిలిచాడు. అయితే, చిన్ననొప్పి కారణంగా సీఎస్‌కే మ్యాచ్‌కు అందుబాటులో లేడు. అయితే, యాష్ దయాల్ అతని స్థానాన్ని బాగా భర్తీ చేశాడు.
సాల్ట్ పరిస్థితి
ఫిల్ సాల్ట్ మాత్రం జ్వరంతో బాధపడుతూ వరుసగా రెండో మ్యాచ్ మిస్ అయ్యాడు. అతను ఇంకా కోలుకోలేదు. ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌లలో 239 పరుగులు చేసి పవర్ ప్లేలో విధ్వంసకర ఆటతీరు కనబరిచాడు.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఓపెనర్లు 51 పరుగులు జోడించడంతో మంచి ఆరంభం లభించింది. షేక్ రషీద్ 11 బంతుల్లో 14 పరుగులు చేశాడు. సామ్ కుర్రాన్ 5 పరుగులు చేసిన తర్వాత విఫలమై ఔటయ్యాడు. ఇక్కడి నుంచి ఆయుష్ మ్హారే, రవీంద్ర జడేజా జోడీ బాధ్యతగా ఆడారు. వీరిద్దరూ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోరును 172కి తీసుకెళ్లారు. మాత్రే సెంచరీకి దగ్గరగా పెవిలియన్ చేరాడు. 48 బంతుల్లో 94 పరుగులు చేశాడు. ఎంఎస్ ధోని 12 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 45 బంతుల్లో 77 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శివం దుబే 3 బంతుల్లో 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కానీ, అతని జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున లుంగీ న్గిడి అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు.
చెన్నై తరఫున యువ ఆటగాడు ఆయుష్ మ్హాత్రే 94 పరుగులు చేయగా, జడేజా అజేయంగా 77 పరుగులతో నిలిచాడు. అయినా కూడా సీఎస్‌కే 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్‌లో 15 పరుగులు కాపాడిన యాష్ దయాల్ మ్యాచ్ హీరోగా నిలిచాడు. చివరి ఓవర్ లో ఒక నో-బాల్ వేసినప్పటికి మ్యాచ్ ను కాపాడాడు దయాల్.
మరోవైపు, రొమారియో షెపర్డ్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి, ఖలీల్ అహ్మద్ ఓవర్‌లో ఒక్కదానిలో 33 పరుగులు కొట్టి సీఎస్‌కే బౌలింగ్‌ను ఛిద్రం చేశాడు. కోహ్లీ – బెథెల్ జోడీ 97 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పి RCBకి మంచి ఆరంభాన్ని ఇచ్చింది. కోహ్లీ 33 బంతుల్లో 62 పరుగులు చేయగా, బెథెల్ కూడా అదే బంతులలో 55 పరుగులు చేశాడు. RCB చివరకు 20 ఓవర్లలో 213/5 స్కోరు చేసింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



