Video: కోచ్ పాదాలను తాకిన టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.?
Harmanpreet kour touches team india women coach Amol Muzumdar's feet: మైదానంలో ఉన్న ఆటగాళ్లను, ప్రేక్షకులను కదిలించిన ఈ గురుభక్తి సన్నివేశం తాలూకు వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నెటిజన్లు హర్మన్‌ప్రీత్ కౌర్ సంస్కారాన్ని, వినయాన్ని ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Harmanpreet kour touches team india women coach Amol Muzumdar’s feet: భారత మహిళల క్రికెట్ జట్టు మొట్టమొదటిసారిగా ఐసీసీ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న చారిత్రక ఘట్టం తర్వాత, మైదానంలో ఒక అత్యంత భావోద్వేగపూరితమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ విజయం కేవలం క్రీడాలోకంలోనే కాకుండా, భారతీయ సంస్కృతిలో గురువు పట్ల శిష్యుడికి ఉండే అపారమైన గౌరవాన్ని కూడా ప్రపంచానికి చాటింది.
గురువుకు పాదాభివందనం..
టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన నాయకత్వంలో జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన వెంటనే, సంబరాల్లో మునిగిపోక ముందు, ఆమె నేరుగా జట్టు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ వద్దకు పరుగున వెళ్లింది.
భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయిన హర్మన్‌ప్రీత్, వెంటనే క్రిందకు వంగి, కోచ్ అమోల్ మజుందార్ పాదాలను తాకి నమస్కరించింది. ఈ చర్య భారతీయ ‘గురు-శిష్య’ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
హర్మన్‌ప్రీత్ పాదాలకు నమస్కరించగానే, ముజుందార్ వెంటనే ఆమెను ఆప్యాయంగా పైకి లేపి, గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భం కోచ్, కెప్టెన్ ఇద్దరి కళ్లలో ఆనంద బాష్పాలను నింపింది.
మా విజయం వెనుక ఆయనే కీలకం..
విజయం అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ, కోచ్ అమోల్ మజుందార్ సహకారాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.
“గత రెండున్నరేళ్లుగా సార్ (మజుందార్) చేసిన కృషి అద్భుతమైనది. ఆయన వచ్చిన తర్వాత జట్టులో అంతా స్థిరంగా, సజావుగా మారింది. మెరుగుపడాల్సిన విషయాలను పదేపదే మాతో సాధన చేయించారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.” అంటూ హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చాడు.
ముజుందార్ కూడా తమ కెప్టెన్ నాయకత్వాన్ని, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండే ఆమె స్వభావాన్ని కొనియాడారు. ఈ విజయం మహిళా క్రికెట్‌కు ఒక ‘సువర్ణాధ్యాయం’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
వైరల్ అయిన భావోద్వేగ సన్నివేశం..
📽️ Raw Reactions
Pure Emotions ❤️
The moment when #WomenInBlue created history by winning the #CWC25 Final 🥳#TeamIndia pic.twitter.com/5jV4xaeilD
— BCCI Women (@BCCIWomen) November 3, 2025
మైదానంలో ఉన్న ఆటగాళ్లను, ప్రేక్షకులను కదిలించిన ఈ గురుభక్తి సన్నివేశం తాలూకు వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నెటిజన్లు హర్మన్‌ప్రీత్ కౌర్ సంస్కారాన్ని, వినయాన్ని ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఈ విజయం కేవలం క్రీడాపరంగానే కాక, వ్యక్తిగత విలువల పరంగా కూడా భారత క్రీడాకారిణులకు ఎంతటి గౌరవం ఉందో చాటి చెప్పింది. భారత క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్, ఎం.ఎస్. ధోని తర్వాత వన్డే ప్రపంచ కప్ సాధించిన మూడవ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డు సృష్టించారు. ఆమె ఈ విజయాన్ని తన గురువుకు అంకితం చేయడం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.




