AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind Vs Pak: ఇంకో రెండు మ్యాచ్‌లే.. పాక్‌ను ఓడించాక హర్మన్‌ప్రీత్ షాకింగ్ కామెంట్స్

Ind Vs Pak: మహిళల ఆసియా కప్ 2026లో పాకిస్థాన్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసింది. టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయని, ఇదే జోరును కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేసింది. 150వ టీ20 మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది.

Ind Vs Pak: ఇంకో రెండు మ్యాచ్‌లే.. పాక్‌ను ఓడించాక హర్మన్‌ప్రీత్ షాకింగ్ కామెంట్స్
Harmanpreet Kaur
Rakesh
|

Updated on: Sep 06, 2026 | 8:09 AM

Share

Ind Vs Pak: మహిళల ఆసియా కప్ 2026లో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడించిన తర్వాత భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం చెలాయించిన టీమిండియా కెప్టెన్, మ్యాచ్ ముగిశాక ధీమా వ్యక్తం చేసింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ హైవోల్టేజ్ పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. కనీసం పోరాటం కూడా చేయలేకపోయిన పాక్ భామలు కేవలం 55 పరుగులకే కుప్పకూలారు. భారత స్పిన్ ద్వయం శ్రీ చరణి, ప్రేమా రావత్ చెరో 3 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించారు. చిన్న లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 8.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని ఖాయం చేసుకుంది. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన శ్రీ చరణికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

వరల్డ్ రికార్డ్ నెలకొల్పిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్

ఈ మ్యాచ్ భారత సారథి హర్మన్‌ప్రీత్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా 150వ మ్యాచ్ ఆడిన ప్రపంచంలోనే ఏకైక క్రీడాకారిణిగా (పురుషులు, మహిళల విభాగాల్లో) సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో జట్టుకు అద్భుత విజయాన్ని అందించడమే కాకుండా, నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ముగించడం విశేషం.

పాక్‌కు నిద్రలేకుండా చేసే వ్యాఖ్యలు

విజయం అనంతరం ప్రెజెంటేషన్ సెర్మనీలో మాట్లాడిన హర్మన్‌ప్రీత్, పాకిస్థాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చేలా వ్యాఖ్యానించింది. “ఈ విజయం మాకు ఎంతో కీలకం. జట్టు ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. మేము ఎప్పుడూ మైదానంలో ఆధిపత్యం ప్రదర్శించడానికే ప్రాధాన్యం ఇస్తాం. బౌలర్లు ప్రణాళికలను కచ్చితత్వంతో అమలు చేశారు” అని చెప్పారు. ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థికి కోపం తెప్పించేలా ఉన్నాయి. “టోర్నీలో ఇంకో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇదే ఊపును చివరి వరకు కొనసాగిస్తాం” అని హర్మన్‌ప్రీత్ స్పష్టం చేసింది.

ఫైనల్, ట్రోఫీపై క్లారిటీ ఇచ్చేసిన కెప్టెన్

సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లను ఉద్దేశించి హర్మన్‌ప్రీత్ ఈ వ్యాఖ్యలు చేసింది. అంటే సెమీఫైనల్ గెలవడం తమకు పెద్ద లెక్క కాదని, ఫైనల్ ఆడి ఆసియా కప్ ట్రోఫీని గెలవడమే తమ తదుపరి లక్ష్యమని ఆమె పరోక్షంగా తేల్చిచెప్పింది. “ఆట లేకపోతే నాకు ఉనికి లేదు. అభిమానుల నుంచి లభిస్తున్న ఈ సపోర్టు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను” అని ఆ భావోద్వేగ క్షణాలను పంచుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us