IPL 2025 సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్.. కోహ్లీకి మరోసారి మొండిచేయి పక్కా?
Mumbai Indians Championship Hope IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్‌లో, హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలుచుకుని ప్లేఆఫ్స్‌కు దూసుకుపోతోంది. ముంబై ఇండియన్స్ చరిత్రలో, వరుసగా ఐదు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలవడం ఏడు సార్లు జరిగింది. వీటిలో నాలుగు సార్లు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది.

Rcb Vs Mi
Mumbai Indians IPL 2025 Winning Streak: ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతోంది. మొదటి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడిన తర్వాత, ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. దీని కారణంగా ముంబై ఇండియన్స్ ఛాంపియన్‌గా నిలిచే ఓ యాదృచ్చికం చోటుసుకుంది. ఐపీఎల్ చరిత్ర గురించి మాట్లాడుకుంటే, ముంబై ఇండియన్స్ జట్టు 2008 నుంచి వరుసగా ఐదు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లను గెలుచుకుంది. ఇలా మొత్తం ఏడు సార్లు జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్ జట్టు నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.
- 2008లో ఐపీఎల్ తొలి సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా ఆరు మ్యాచ్‌లను గెలిచింది. కానీ, ముంబై జట్టు తొలి సీజన్‌లో ఛాంపియన్‌గా నిలవలేకపోయింది.
- 2010 సంవత్సరంలో ముంబై జట్టు వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. కానీ, ఈ సీజన్‌లో ముంబై ఫైనల్‌లో ఓడిపోయింది. ముంబై ఛాంపియన్‌గా అవతరించడం 2013 సంవత్సరం నుంచి ప్రారంభమైంది.
- 2013లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆ తరువాత, ముంబై జట్టు తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది.
- 2013 సంవత్సరం తర్వాత, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టు 2015 ఐపీఎల్ సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లను గెలిచింది. ఆ తర్వాత కూడా, ఫైనల్‌లో చెన్నైని ఓడించి ముంబై టైటిల్‌ను గెలుచుకుంది.
- 2017 ఐపీఎల్ సీజన్‌లో కూడా ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఐదు కాదు, ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆ తర్వాత 2017 ఫైనల్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌ను ఓడించి ముంబై ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.
- 2017 సంవత్సరం తర్వాత, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 2020 ఐపీఎల్ సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లను గెలిచింది. ఆ తర్వాత, 2020 సంవత్సరం ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ముంబై టైటిల్‌ను గెలుచుకుంది.
- ఇప్పుడు 2025 ఐపీఎల్ సీజన్‌లో, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ వరుసగా ఐదు మ్యాచ్‌లను గెలిచింది. ఆ తర్వాత ముంబై ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందని నమ్ముతున్నారు. ఇదన్నమాట ముంబై ఛాంపియన్‌గా నిలిచిన యాదృచ్చికం మ్యాటర్. లీగ్ దశలో వరుసగా ఐదు లేదా అంతకంటే ఎక్కువ విజయాలు నమోదు చేయడం ద్వారా ముంబై ఇప్పటివరకు నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








