Hardik Pandya: హార్దిక్ పాండ్యాకి పెద్ద సవాల్.. నెగ్గితేనే ఐపీఎల్ ఆడతాడు..!
Hardik Pandya: హార్దిక్ పాండ్యా చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. ఫిట్‌నెస్ సమస్యతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్
Hardik Pandya: హార్దిక్ పాండ్యా చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. ఫిట్‌నెస్ సమస్యతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడేందుకు హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ కీలక పరీక్ష పెట్టింది. ఈ టెస్టులో పాస్ కాకుండా హార్దిక్ పాండ్యా ఐపీఎల్ ఆడలేడు. దాంతో ఈ పరీక్షలో నెగ్గడం చాలా ముఖ్యం. ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వార్తల ప్రకారం.. ఐపిఎల్‌లో పాల్గొనడానికి ముందు హార్దిక్ పాండ్యా ఎదుట చాలా సవాళ్లు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా 10 ఓవర్లు బౌలింగ్ చేసి యో-యో టెస్టులో ఉత్తీర్ణత సాధించాలని సెలక్టర్లు స్పష్టం చేశారు. బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌తో సంబంధం ఉన్న ఆటగాళ్లందరూ ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం చాలా ముఖ్యం. హార్దిక్ చివరిసారిగా 2021 టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తరపున ఆడాడు. అప్పటి నుంచి అతను టీమ్ ఇండియాకు దూరమయ్యాడు.
టీ20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయలేదు. చాలా బ్యాడ్ ఫామ్‌తో పోరాడుతున్నాడు. IPL 2022లో ఈసారి రెండు కొత్త జట్లు వస్తున్న సంగతి తెలిసిందే. అందులో గుజరాత్ టైటాన్స్ జట్టుకి హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా ఒకప్పుడు భారతదేశం నంబర్ వన్ ఆల్ రౌండర్. కానీ ఆ తర్వాత అతను గాయాల కారణంగా వెనుకబడిపోయాడు. అతని స్థానంలో చాలా మంది యువ ఆటగాళ్లు వచ్చారు. హార్దిక్ భారతదేశం తరపున మూడు ఫార్మాట్లలో ఆడాడు. భారత్ తరఫున హార్దిక్ 11 టెస్టు మ్యాచ్‌ల్లో 532 పరుగులు, 63 వన్డేల్లో 1267 పరుగులు, 56 వికెట్లు సాధించాడు. అదే సమయంలో టీ20 ఫార్మాట్‌లో అతను 49 మ్యాచ్‌లలో 484 పరుగులు, 42 పరుగులు చేశాడు.