GT vs MI: పాత స్నేహితుల మధ్య హై ఓల్టేజ్ ఫైట్.. టాస్ గెలిచిన రోహిత్.. ప్లేయింగ్-XI, ఇంపాక్ట్ లిస్ట్ ఇదే
పాండ్యా గతంలో ముంబై ఇండియన్స్ జట్టులో కీలక సభ్యుడు. గత సీజన్ నుంచి గుజరాత్ కెప్టెన్‌గా సేవలందిస్తున్నాడు. దీంతో గుజరాత్ వర్సెస్ ముంబై పోరు ఆసక్తికరంగా మారింది. మరోవైపు సచిన్ కుమార్తె సారా టెండూల్కర్, గిల్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
డిపెండింగ్ ఛాంపియన్ గా ఐపీఎల్ 2023లోకి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో ఛాంపియన్ టీమ్‌లా ఆడుతోంది. అయితే సొంతమైదానంలో మాత్రం ఆ జట్టుకు నిరాశకరమైన ఫలితాలే ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు అహ్మదాబాద్‌లో 3 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ సేన రెండింటిలో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఎన్నో విశేషాలున్నాయి. పాండ్యా గతంలో ముంబై ఇండియన్స్ జట్టులో కీలక సభ్యుడు. గత సీజన్ నుంచి గుజరాత్ కెప్టెన్‌గా సేవలందిస్తున్నాడు. దీంతో గుజరాత్ వర్సెస్ ముంబై పోరు ఆసక్తికరంగా మారింది. మరోవైపు సచిన్ కుమార్తె సారా టెండూల్కర్, గిల్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ ఓపెనర్ శుభమన్ గిల్, అర్జున్ టెండూల్కర్‌ల మధ్య పోరు కూడా ఎలా ఉండనుందోనని క్రికెట్ ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై జట్టులో రెండు మార్పులు చేసింది. హృతిక్ షోకిన్ బయటకు వెళ్లగా, అతని స్థానంలో కుమార్ కార్తికేయ వచ్చాడు. జోఫ్రా ఆర్చర్ స్థానంలో రిలే మెరెడిత్‌కు అవకాశం లభించింది.
ఇరు జట్ల ప్లేయింగ్-XI ఎలా ఉందంటే?
ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ (c), ఇషాన్ కిషన్ (WK), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, అర్జున్ టెండూల్కర్, రిలే మెరెడిత్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్
ఇంపాక్ట్ ప్లేయర్స్
రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, షామ్స్ ములానీ, విష్ణు వినోద్, సందీప్ వారియర్.
గుజరాత్ టైటాన్స్
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ.
ఇంపాక్ట్ ప్లేయర్స్
లిటిల్, డాసున్ శనక, శివమ్ మావి, సాయి కిషోర్, శ్రీకర్ భరత్.
Riley is ?, KK starts! Here’s your Playing XI for #GTvMI. ??#OneFamily #GTvMI #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 @Dream11 pic.twitter.com/5eWmFpDpHN
— Mumbai Indians (@mipaltan) April 25, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..