Telugu News Sports News Cricket news IPL 2023: Shubman Gill, Abhinav Manohar, David Miller power Gujarat Titans to 207/6 vs Mumbai Indians Telugu Cricket News
GT vs MI: అదరగొట్టిన గిల్.. మిల్లర్, అభినవ్‌ల మెరుపులు.. ముంబై ముందు గుజరాత్ భారీ టార్గెట్
శుభమన్ గిల్ మళ్లీ అదరగొట్టాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గిల్ అద్భుతమైన అర్ధ సెంచరీని సాధించాడు. కేవలం 34 బంతుల్లోనే 56 పరుగులు సాధించాడు. ఇందులో 7 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
శుభమన్ గిల్ మళ్లీ అదరగొట్టాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గిల్ అద్భుతమైన అర్ధ సెంచరీని సాధించాడు. కేవలం 34 బంతుల్లోనే 56 పరుగులు సాధించాడు. ఇందులో 7 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అతనికి తోడు అభినవ్ మనోహర్ (21 బంతుల్లో 42, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (22 బంతుల్లో 46, 2 ఫోర్లు 4 సిక్స్‌లు), రాహుల్ తెవాతియా ( 5 బంతుల్లో 20 3 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది రాజస్థాన్. ముంబయి బౌలర్లలో పీయూష్ చావ్లా 2 వికెట్లు తీయగా.. అర్జున్ తెందూల్కర్, రైలీ, కుమార్ కార్తికేయ, జేసన్ తలో వికెట్ తీశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు గిల్ శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ సాహా ఔటైనా దూకుడు కొనసాగించాడు. ఈ సీజన్‌లో గిల్‌కి ఇది మూడో అర్ధ సెంచరీ. అంతకుముందు అతను చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌లపై హాఫ్ సెంచరీలు సాధించాడు. చెన్నైపై 63 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్‌పై 67 రన్స్ చేశాడు. ఓవరాల్ గా ఐపీఎల్‌లో అతనికిది 17వ అర్ధశతకం.
For his solid 56-run opening act, @ShubmanGill becomes our ? performer from the first innings of the #GTvMI clash in the #TATAIPL ??