AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final 2023: టీమిండియాను తాకిన ఐపీఎల్ రిజర్వ్ డే హీట్.. ఇండియాలోనే ముగ్గురు స్టార్ ప్లేయర్స్..

IPL 2023 Final, GT vs CSK: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 7న ప్రారంభం కానుంది. గిల్, షమీ, జడేజా గురువారం లండన్ చేరుకోనున్నారు. ఒకరోజు విశ్రాంతి తీసుకుని ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు.

WTC Final 2023: టీమిండియాను తాకిన ఐపీఎల్ రిజర్వ్ డే హీట్.. ఇండియాలోనే ముగ్గురు స్టార్ ప్లేయర్స్..
Wtc Final 2023, Ind Vs Aus
Venkata Chari
|

Updated on: May 29, 2023 | 3:17 PM

Share

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final 2023)కి సిద్ధమవుతున్న భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ఫైనల్ (IPL 2023 Fianl) ఆదివారం రిజర్వ్ డే అనుకున్నట్లుగా జరగకపోవడంతో సోమవారానికి వాయిదా పడింది. అందుకే లండన్ వెళ్లాల్సిన టీమ్ ఇండియా ముగ్గురు ఆటగాళ్లు ఇంకా ఇండియాలోనే ఉన్నారు. గుజరాత్ జట్టుకు చెందిన శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా ఈరోజు యూకే వెళ్లాల్సి ఉంది. అయితే, ఐపీఎల్ 2023 ఫైనల్‌ను ఒక రోజు తర్వాత జరగనుండడంతో భారత్‌లో ఉండాల్సి ఉంది.

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 7న ప్రారంభం కానుంది. గిల్, షమీ, జడేజా గురువారం లండన్ చేరుకోనున్నారు. తర్వాత ఒకరోజు విశ్రాంతి తీసుకుని సాధన ప్రారంభించాల్సి ఉంది. ఈ ముగ్గురు మినహా మిగతా ఆటగాళ్లంతా జట్టులో చేరారు. దీంతో కోచ్ ద్రవిడ్ జట్టు మొత్తానికి కలిసి శిక్షణ ఇవ్వడం కష్టంగా మారింది.

కెప్టెన్ రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో ఎంపికైన యశస్వి జైస్వాల్ ఆదివారం సాయంత్రం రెండో బ్యాచ్‌గా వచ్చారు. మొదటి బ్యాచ్ మే 24న బయలుదేరింది. విరాట్ కోహ్లీ, అశ్విన్, అక్షర్ పటేల్ సహా కొందరు ఆటగాళ్లు ఈ లిస్టులో ఉన్నారు. వీరంతా ఇప్పటికే ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నారు. కెప్టెన్ రోహిత్ ఈరోజు ప్రాక్టీస్ చేయబోతున్నాడు.

ఇవి కూడా చదవండి

ఫైనల్స్ సందర్భంగా వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌..

ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న 50 ఓవర్ల ప్రపంచకప్ షెడ్యూల్‌ను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ సందర్భంగా ప్రకటిస్తామని బీసీసీఐ సెక్రటరీ జే షా తెలిపారు. ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్ వేదికలు ప్రకటించారు. టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను కూడా విడుదల చేయనున్నారు. టెస్ట్ ఆడే దేశాలు, ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లోని అసోసియేట్ నేషన్స్ సభ్యుల మధ్య సమావేశం తర్వాత ఆసియా కప్ 2023 భవితవ్యాన్ని నిర్ణయిస్తామని చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..