Shreyas Iyer : కివీస్‌కు ఇక చుక్కలే..టీమిండియాలోకి ఆ ఖతర్నాక్ బ్యాటర్ ఎంట్రీ ఫిక్స్..ఫిట్‌నెస్ రిపోర్ట్ వచ్చేసింది
Shreyas Iyer : నేషనల్ టీంలోకి రావడానికి ముందు అయ్యర్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి దేశవాళీ క్రికెట్ ఆడారు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు తరపున బరిలోకి దిగిన ఆయన, హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు.

Shreyas Iyer : భారత వన్డే జట్టులో కీలక ఆటగాడైన శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. గత కొంతకాలంగా గాయంతో సతమతమవుతున్న అయ్యర్, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి న్యూజిలాండ్ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో అయ్యర్ పేరు ఉన్నప్పటికీ, ఆయన ఆడటం అనేది ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని సెలక్టర్లు అప్పట్లో స్పష్టం చేశారు. తాజా సమాచారం ప్రకారం, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఆయన రిహాబిలిటేషన్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఎన్‌సీఏ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ ఇప్పటికే అయ్యర్ ఫిట్‌నెస్ రిపోర్ట్‌ను చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు మెయిల్ ద్వారా పంపినట్లు తెలుస్తోంది.
జాతీయ జట్టులోకి రావడానికి ముందు అయ్యర్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి దేశవాళీ క్రికెట్ ఆడారు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు తరపున బరిలోకి దిగిన ఆయన, హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ప్రస్తుతం ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అయ్యర్, జనవరి 8న పంజాబ్‌తో జరగనున్న మ్యాచ్‌లో కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్‌లో కూడా రాణిస్తే, 11వ తేదీన జరిగే మొదటి వన్డేలో ఆయన ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండటం ఖాయం.
శ్రేయస్ అయ్యర్ ఎదుర్కొన్న గాయం సామాన్యమైంది కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో క్యాచ్ పట్టబోయి ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అంతర్గత రక్తస్రావం కారణంగా ఆయన పరిస్థితి విషమించడంతో కొద్దిరోజులు ఐసీయూలో కూడా చికిత్స పొందాల్సి వచ్చింది. ఒక దశలో ఆయన కెరీర్ ఏమౌతుందో అని అభిమానులు ఆందోళన చెందారు. కానీ మొక్కవోని దీక్షతో కఠినమైన రిహాబ్ ప్రక్రియను పూర్తి చేసి, మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడం ఆయన పోరాట పటిమకు నిదర్శనం.
న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.
