AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Gambhir: మళ్లీ ఆ జట్టులోకే గౌతమ్‌ గంభీర్‌ ఎంట్రీ.. లేదంటే ఐపీఎల్‌కు గుడ్‌ బై.. అసలు విషయమేమిటంటే?

IPL-2024కి ముందు, లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఆండీ ఫ్లవర్ స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్‌ను ఇటీవల జట్టు హెడ్‌ కోచ్‌గా నియమించారు. అలాగే బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా సలహాదారుగా నియమితులయ్యారు. ఇప్పుడు మరో కీలక మైన వ్యక్తి టీమ్‌ను వీడబోతున్నాడు.

Gautam Gambhir: మళ్లీ ఆ జట్టులోకే గౌతమ్‌ గంభీర్‌ ఎంట్రీ.. లేదంటే ఐపీఎల్‌కు గుడ్‌ బై.. అసలు విషయమేమిటంటే?
Gautam Gambhir
Basha Shek
|

Updated on: Aug 20, 2023 | 1:09 PM

Share

IPL-2024కి ముందు, లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఆండీ ఫ్లవర్ స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్‌ను ఇటీవల జట్టు హెడ్‌ కోచ్‌గా నియమించారు. అలాగే బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా సలహాదారుగా నియమితులయ్యారు. ఇప్పుడు మరో కీలక మైన వ్యక్తి టీమ్‌ను వీడబోతున్నాడు. గత రెండేళ్లుగా టీమ్‌తో మెంటార్‌గా ఉన్న మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ లక్నో ఫ్రాంచైజీకి దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే గంభీర్ తన పాత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరవచ్చని తెలుస్తోంది. ఆండీ ఫ్లవర్ తర్వాత, గంభీర్ లక్నో జట్టు నుండి నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్నాడంటూ ఓ ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. గంభీర్ జట్టు నుండి నిష్క్రమించడం గురించి లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాను అడిగినప్పుడు, అతను ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. IPL-2022లో లక్నో తొలిసారిగా ఈ లీగ్‌లోకి అడుగుపెట్టింది. అద్భుతమైన ఆటతీరుతో ప్లేఆఫ్‌కు చేరుకుంది. ఇక రెండో సారి IPL-2023 లోనూ ఈ జట్టు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవడంలో సఫలమైంది.

కేకేఆర్‌.. లేదంటే గుడ్‌ బై

కాగా కొన్ని నివేదికల ప్రకారం, గంభీర్ తన పాత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు తిరిగి రావచ్చు. గంభీర్ కెప్టెన్సీలో కోల్‌కతా రెండుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. దీనికి సంబంధించి ఫ్రాంచైజీ, గంభీర్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ జట్టు 2012, 2014లో ఐపీఎల్‌ను గెలుచుకుంది. కానీ గంభీర్ నిష్క్రమణ తర్వాత ఈ జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గంభీర్ మళ్లీ తన పాత జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కోల్‌కతా ఐపీఎల్-2023కి ముందు దేశవాళీ క్రికెట్ వెటరన్ చంద్రకాంత్ పండిట్‌ను జట్టు కోచ్‌గా నియమించింది, అయితే ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. మరి గంభీర్ కోల్‌కతాకు వస్తాడో లేదో చూడాలి. మరోవైపు గంభీర్ బీజేపీ ఎంపీగా కూడా ఉన్నారు. దీనికి తోడు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు కూడా జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలు, ఐపీఎల్‌ దాదాపు ఒకే సమయంలో ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్‌ ఎన్నికలపై దృష్టి పెట్టడానికి కోచింగ్ నుండి విరామం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

గౌతమ్ గంభీర్ ఇన్ స్టా గ్రామ్  పోస్ట్

గౌతమ్ గంభీర్ ఇన్ స్టా గ్రామ్  పోస్ట్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..