Gambhir Coments: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ను నియమించడంపై ఇండియన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..

Gautam Gambhir Coments: సంజూ శాంసన్‌ను రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా నియమించడంపై టీం ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021 ఐపీఎల్‌ కోసం

  • uppula Raju
  • Publish Date - 7:48 am, Sun, 24 January 21
Gambhir Coments: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ను నియమించడంపై ఇండియన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..

Gautam Gambhir Coments: సంజూ శాంసన్‌ను రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా నియమించడంపై టీం ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021 ఐపీఎల్‌ కోసం రాజస్థాన్‌ ఇటీవల స్టీవ్‌స్మిత్‌ను కెప్టెన్‌గా తీసేయడమే కాకుండా జట్టు నుంచే తొలగించింది. దీంతో ఆ బాధ్యతలను యువ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌కు అప్పగించింది. ఈ విషయంపై స్పందించిన గంభీర్‌ స్మిత్‌ను తీసేయడం సరైన నిర్ణయమే కానీ సంజూ కెప్టెన్‌ చేయడం తొందరపాటు చర్య అన్నాడు.

ఎందుకంటే అతడు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునేందుకు సరైన సమయం కాదని అభిప్రాయపడ్డాడు. ఆ జట్టుకు అనుభవజ్ఞులైన జోస్‌ బట్లర్‌, బెన్‌స్టోక్స్‌ ఉన్నారు. ఒకవేళ బట్లర్‌ ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లూ ఆడితే అతడిని కెప్టెన్‌ చేసి సంజూను వైస్‌కెప్టెన్‌గా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. రాజస్థాన్‌ ఈ యువ క్రికెటర్‌ను నమ్మింది. అతడెలా రాణిస్తాడో చూడాలి. రోహిత్‌లా విజయవంతం అవుతాడో లేదో వేచి చూడాలని గంభీర్‌ వివరించాడు. మరోవైపు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ను అట్టిపెట్టుకోవడం కూడా తనకు ఆశ్చర్యం కలిగించిందని తెలిపాడు.

కోహ్లీ, రోహిత్‌ మధ్య భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది..!