RCB: ఆర్‌సీబీకి ట్రోఫీ అందించే ముగ్గురు మొనగాళ్లు.. ఫైనల్ చేరితే 18 ఏళ్ల కరువు తీరినట్లే భయ్యా..
Royal Challengers Bengaluru: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉంది. అదే సమయంలో, ఈ సంవత్సరం ఆర్‌సీబీ 18 సంవత్సరాల కరువును అంతం చేయగలదని క్రీడా నిపుణులు విశ్వసిస్తున్నారు. ఆర్‌సీబీ తన మొదటి ఐపీఎల్ ట్రోఫీని గెలవడంలో కీలక పాత్ర పోషించగల ముగ్గురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Royal Challengers Bengaluru: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025)లో, కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు గొప్ప లయలో కనిపిస్తోంది. 18వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా రాణించింది. 11 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌ల్లో గెలిచి, 3 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. ఈ అద్భుతమైన ప్రదర్శన కారణంగా ఆర్‌సీబీ 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉంది. అదే సమయంలో, ఈ సంవత్సరం ఆర్‌సీబీ 18 సంవత్సరాల కరువును అంతం చేయగలదని క్రీడా నిపుణులు విశ్వసిస్తున్నారు. ఆర్‌సీబీ తన మొదటి ఐపీఎల్ ట్రోఫీని గెలవడంలో కీలక పాత్ర పోషించగల ముగ్గురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మునుపెన్నడూ లేని ఫాంలో విరాట్ కోహ్లీ..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ ఫ్రాంచైజీకి చెందిన అత్యంత సీనియర్, విశ్వసనీయ ఆటగాళ్లలో ఒకడిగా పేరుగాంచాడు. గత 18 సంవత్సరాలుగా RCB తరపున మొదటి IPL టైటిల్ గెలవాలనే కలతో ఆడుతున్నాడు. ఇందుకు తన 100 శాతం ఇవ్వడంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడు.
18వ సీజన్‌లో కోహ్లీ బ్యాట్ నుంచి పరుగులు మాత్రమే కాదు, ఆరెంజ్ క్యాప్ కోసం అతిపెద్ద పోటీదారులలో ఒకడిగా నిలిచాడు. ఎందుకంటే, కోహ్లీ 11 మ్యాచ్‌ల్లో 63 సగటుతో 505 పరుగులు చేశాడు. ప్లేఆఫ్స్‌కు చేరుకున్న తర్వాత కింగ్ కోహ్లీ బ్యాట్ ఇలా గర్జిస్తే, ఈ సంవత్సరం ఐపీఎల్‌లో ఆర్‌సీబీ టైటిల్ గెలవకుండా ఎవరూ ఆపలేరు.
బ్యాటర్ల పాలిట విలన్‌లా మారిన జోష్ హాజిల్‌వుడ్..
ఆస్ట్రేలియా జట్టు ఫాస్ట్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బౌలింగ్ యూనిట్ భారం మొత్తాన్ని అతను తన భుజాలపై వేసుకున్నాడు. అతను కొత్త బంతితో బ్యాటర్ల పాలిట యముడిలా మారుతున్నాడు. జోష్ హేజిల్‌వుడ్‌పై పరుగులు సాధించడానికి అత్యుత్తమ బ్యాట్స్‌మెన్స్ కూడా కష్టపడాల్సి వస్తోంది.
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ టైటిల్ గెలవడంలో విజయవంతమైతే, ఈ ఆటగాడి కీలక సహకారం ఉంటుంది. పర్పుల్ క్యాప్ రేసులో అతను అతిపెద్ద పోటీదారులలో ఒకడు. జోష్ హాజిల్‌వుడ్ 10 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అతను 18వ స్థానంలో ఉన్నాడు.
టిమ్ డేవిడ్ దూకుడు..
ఈ జాబితాలో మూడవ పేరు గేమ్ ఛేంజర్ బ్యాట్స్‌మన్ టిమ్ డేవిడ్. ఇప్పటివరకు RCB కి ట్రబుల్షూటర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించగా, టిమ్ డేవిడ్ మ్యాచ్‌ను ముగింపు దశకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రారంభం ఎలా ఉందనేది ముఖ్యం కాదని అంటారు.
టివ్ డేవిడ్ ఫినిషర్ పాత్రను చాలా బాగా పోషించాడు. ఇప్పటికే ఇది నిరూపితమైంది. ఓడే మ్యాచ్‌లను దాటుకుని విజయం సాధించడానికి జట్టుకు సహాయం చేస్తున్నాడు. రాబోయే మ్యాచ్‌లలో డేవిడ్ ఇదే విధంగా తన పనిని కొనసాగిస్తే, RCB మొదటి IPL ట్రోఫీని వారి చేతుల్లోకి తీసుకునే రోజు ఎంతో దూరంలో లేదని అంతా భావిస్తున్నారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








