Team India: టీ20 ప్రపంచకప్‌లో చేరిన ఐదుగురు RCB ఆటగాళ్లు.. లిస్టులో టీమిండియా యువ సెన్సెషన్

5 RCB Players In T20 World Cup Squad: ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 కోసం భారత మహిళల జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోసారి హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఈసారి మహిళల టీ20 ప్రపంచకప్‌నకు బంగ్లాదేశ్‌కు ఆతిథ్యం లభించింది. అయితే దేశంలోని అధ్వాన్నమైన పరిస్థితులు, పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా, ప్రపంచ కప్‌ను బంగ్లా నుంచి మార్చవలసి వచ్చింది.

Team India: టీ20 ప్రపంచకప్‌లో చేరిన ఐదుగురు RCB ఆటగాళ్లు.. లిస్టులో టీమిండియా యువ సెన్సెషన్
Rcb Team India
Follow us
Venkata Chari

|

Updated on: Aug 28, 2024 | 12:16 PM

5 RCB Players In T20 World Cup Squad: ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 కోసం భారత మహిళల జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోసారి హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఈసారి మహిళల టీ20 ప్రపంచకప్‌నకు బంగ్లాదేశ్‌కు ఆతిథ్యం లభించింది. అయితే దేశంలోని అధ్వాన్నమైన పరిస్థితులు, పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా, ప్రపంచ కప్‌ను బంగ్లా నుంచి మార్చవలసి వచ్చింది. ఇప్పుడు మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు దుబాయ్, షార్జాలో జరగనున్నాయి.

భారత మహిళల జట్టును వెల్లడించిన తర్వాత, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన ఐదుగురు ఆటగాళ్లు జట్టులో ఎంపికైనట్లు చూడవచ్చు.

5. ఆశా శోభన..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆశా శోభన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతోంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆమె ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఆశా బౌలింగ్ చేస్తూ 17 వికెట్లు పడగొట్టింది. ఇప్పుడు ఆమె T20 ప్రపంచ కప్ 2024 కోసం భారత మహిళల జట్టులో ఎంపికైంది.

4. రేణుకా సింగ్..

ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ కూడా మహిళల ప్రీమియర్ లీగ్‌లో RCB తరపున ఆడుతుంది. ఇప్పటి వరకు ఆర్‌సీబీ తరపున 16 మ్యాచ్‌లు ఆడింది. బౌలింగ్‌లో రేణుక 3 వికెట్లు పడగొట్టింది. ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో రేణుక కూడా చేరింది.

3. శ్రేయాంక పాటిల్..

శ్రేయాంక పాటిల్ అద్భుతమైన బౌలర్. మహిళల ప్రీమియర్ లీగ్‌లో RCB తరపున శ్రేయాంక ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఆమె బౌలింగ్ చేస్తూ 19 వికెట్లు పడగొట్టింది. శ్రేయాంక కూడా ప్రపంచకప్ కోసం టీమ్ ఇండియాలో చేరింది.

2. రిచా ఘోష్..

రిచా ఘోష్ అద్భుతమైన బ్యాటర్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో RCB తరపున ఆమె ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడింది. రిచా ఇప్పటి వరకు RCB తరపున 18 మ్యాచ్‌లు ఆడింది. అందులో ఆమె బ్యాటింగ్ చేస్తూ 395 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు రిచా మ్యాజిక్ మహిళల ప్రపంచ కప్ 2024లో చూడవచ్చు.

1. స్మృతి మంధాన..

మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. RCB తరపున ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడింది. బ్యాటింగ్‌లో మంధాన 449 పరుగులు చేసింది. ఇందులో 2 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. ఆమె కెప్టెన్సీలో, మంధాన RCBని మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకంది. ఇప్పుడు ప్రపంచకప్‌లో సందడి చేసేందుకు స్మృతి మంధాన సిద్ధమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..