IND vs BAN: దేశవాళీలో తుస్సుమన్న స్టార్ ప్లేయర్లు.. కట్‌చేస్తే.. బంగ్లా సిరీస్ నుంచి ఈ నలుగురు ఔట్..
India Batter Flopped In Duleep Trophy: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌లకు ముందు, ఈ రోజుల్లో టీమిండియాలోని కొంతమంది ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు. తొలిరోజు ఆటలోనే చాలా మంది పెద్ద హీరోలు విఫలమయ్యారు. కొంతమంది యువ ఆటగాళ్లు బాగా రాణించినప్పటికీ, మరికొందరు వెటరన్ ఆటగాళ్లు అపజయం పాలయ్యారు.
India Batter Flopped In Duleep Trophy: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌లకు ముందు, ఈ రోజుల్లో టీమిండియాలోని కొంతమంది ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు. తొలిరోజు ఆటలోనే చాలా మంది పెద్ద హీరోలు విఫలమయ్యారు. కొంతమంది యువ ఆటగాళ్లు బాగా రాణించినప్పటికీ, మరికొందరు వెటరన్ ఆటగాళ్లు అపజయం పాలయ్యారు. ఈ కారణంగానే బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు ముందు సెలక్టర్ల టెన్షన్ పెరిగి ఈ ఆటగాళ్లను పక్కనపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లు మొదటి రోజు ఫ్లాప్ అయ్యారు. ఇండియా బి తరపున ఆడుతున్న యశస్వి జైస్వాల్ 59 బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేశాడు. కాగా, సర్ఫరాజ్ ఖాన్ 35 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 10 బంతుల్లో 7 పరుగులు చేసి రిషబ్ పంత్ కూడా ఔటయ్యాడు. ఖాతా తెరవకుండానే వాషింగ్టన్ సుందర్ ఔటయ్యాడు.
ఇండియా సి, ఇండియా డి మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఇదే కథ. ఈ మ్యాచ్‌లో ఇండియా సి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. వీరితో పాటు సాయి సుదర్శన్ 7 పరుగులు, రజత్ పాటిదార్ 13 పరుగులు మాత్రమే చేయగలిగారు. అదే మ్యాచ్‌లో 16 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి ఇండియా డి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఔటయ్యాడు. దేవదత్ పడిక్కల్ కూడా 4 బంతులు ఆడిన తర్వాత ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అక్షర్ పటేల్ మాత్రం 86 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
శ్రేయాస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్‌లపై వేలాడుతోన్న కత్తి..
Top duds from Day 1 of Duleep Trophy:
– Devdutt Padikkal: 0 – Ruturaj Gaikwad: 5 – Rishabh Pant: 7 – Sai Sudarshan: 7 – Sarfaraz Khan: 9 – Shreyas Iyer: 9 – Kuldeep Yadav: 0/50#DuleepTrophy #MSDhoni #RishabhPant #DuleepTrophy2024 #ViratKohli #MusheerKhan #IshanKishan… pic.twitter.com/ADhgTirvO7
— Cricketism (@MidnightMusinng) September 5, 2024
తొలిరోజు ఫ్లాప్ అయిన చాలా మంది ఆటగాళ్లు త్వరలో జరగనున్న బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది. అయితే శ్రేయాస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి ఆటగాళ్లు తప్పుకోవచ్చు. అయ్యర్ భారత జట్టుకు ఫ్లాప్ అయ్యాడు. ఇప్పుడు అతను దేశీయంగా కూడా ఫ్లాప్ అవుతున్నాడు. రాబోయే ఇన్నింగ్స్‌లో అతని ఆటతీరు బాగాలేకపోతే బంగ్లాదేశ్ సిరీస్ నుంచి కచ్చితంగా నిష్క్రమించవచ్చు. దీంతో పాటు సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్ వంటి ఆటగాళ్లు కూడా మెరుగవ్వాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన టీమ్‌ను త్వరలో ప్రకటించనున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..