AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India 2025 Schedule: ఆసీస్‌లో మొదలుపెట్టి, సౌతాఫ్రికాతో ముగింపు.. 2025లో టీమిండియా ఫుల్ షెడ్యూల్ ఇదే

Indian Team 2025 Cricket Schedule: భారత్ 2025 సంవత్సరాన్ని టెస్ట్ క్రికెట్‌తో ప్రారంభించనుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి ఈవెంట్లను ఆడాల్సి ఉంది. టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉండగా.. వన్డే-టీ20 కోసం ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో టీమిండియా 2025లో పూర్తి షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

India 2025 Schedule: ఆసీస్‌లో మొదలుపెట్టి, సౌతాఫ్రికాతో ముగింపు.. 2025లో టీమిండియా ఫుల్ షెడ్యూల్ ఇదే
Team India
Venkata Chari
|

Updated on: Dec 31, 2024 | 10:52 AM

Share

Indian Team 2025 Cricket Schedule: మెల్‌బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో భారత క్రికెట్ జట్టు 2024 సంవత్సరాన్ని ముగించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 184 పరుగుల తేడాతో విఫలమైంది. 2024 సంవత్సరం భారతదేశానికి మిశ్రమంగా నిలిచింది. ఈ సంవత్సరం ఐసీసీ ట్రోఫీ కరువు ముగిసింది. కానీ, మిగిలిన రెండు ఫార్మాట్లలో చాలా పేలవమైన ఫలితాలు కనిపించాయి. 27 ఏళ్ల తర్వాత తొలిసారిగా శ్రీలంక చేతిలో వన్డే సిరీస్‌ ఓడిపోవడంతో పాటు స్వదేశంలో టెస్టు సిరీస్‌లోనూ 12 ఏళ్ల తర్వాత ఓడిపోయింది. అయితే, జూన్ 2024లో టీ20 ప్రపంచకప్ ట్రోఫీని రెండోసారి కైవసం చేసుకుంది. 2025లో భారత జట్టు కొత్త అద్భుతాలు చేసే అవకాశం ఉంటుంది.

భారత్ 2025 సంవత్సరాన్ని టెస్ట్ క్రికెట్‌తో ప్రారంభించనుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి ఈవెంట్లను ఆడాల్సి ఉంది. టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉంది. అలాగే, వన్డే-టీ20 కోసం ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంటుంది. స్వదేశంలో వెస్టిండీస్-దక్షిణాఫ్రికాతో తలపడాలి. 2025లో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ కాకుండా మొత్తం 39 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో 18 టీ20 ఇంటర్నేషనల్‌లు, తొమ్మిది టెస్టులు, 12 వన్డేలు ఉన్నాయి. ICC, ACC ఈవెంట్‌లను జోడించినట్లయితే, ఈ మ్యాచ్‌లు దాదాపు 50 వరకు ఉండవచ్చు.

టీంమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ ఎప్పుడు ఆడుతుంది?

భారత జట్టు ఫిబ్రవరి-మార్చిలో యూఏఈలో చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఒకవేళ భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటే ఈ ఈవెంట్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. మార్చి నుంచి మే వరకు భారత ఆటగాళ్లు ఐపీఎల్‌లో బిజీగా ఉంటారు. జూన్‌లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌ను ప్రారంభించనుంది. అలాగే, అక్టోబర్‌లో జరిగే ఆసియా కప్‌నకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఇది ఈసారి టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

భారత క్రికెట్ జట్టు 2025 పూర్తి షెడ్యూల్..

జనవరి 2025- ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో చివరి టెస్టు ఆడనుంది.

జనవరి-ఫిబ్రవరి- ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లి మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.

ఫిబ్రవరి-మార్చి 2025- ఛాంపియన్స్ ట్రోఫీ 2025

జూన్-ఆగస్టు 2025- ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.

ఆగస్టు 2025- బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లి మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది.

అక్టోబర్ 2025- వెస్టిండీస్‌తో రెండు టెస్టులు ఆడనుంది. (హోస్ట్ చేయనుంది)

అక్టోబర్ 2025- ఆసియా కప్ T20 (హోస్ట్ చేయనుంది)

అక్టోబర్-నవంబర్ 2025- ఆస్ట్రేలియా పర్యటన. మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.

నవంబర్-డిసెంబర్ 2025- దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. (హోస్ట్ చేయనుంది).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..