England: కారు ప్రమాదంలో గాయపడిన ఇంగ్లండ్ మాజీ ప్లేయర్.. విమానంలో ఆస్పత్రికి తరలించిన సిబ్బంది..
Car Crash: సోమవారం ఉదయం టాప్ గేర్ టెస్ట్ ట్రాక్ షూట్ చేసేందుకు ఫ్లింటాఫ్ వచ్చిన సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో ఇంగ్లండ్ మాజీ ప్లేయర్‌కు గాయలయ్యాయని బీబీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ను విమానంలో ఆసుపత్రికి తరలించారు. అతని కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఫ్లింటాఫ్ బీబీసీ సిరీస్ ఎపిసోడ్‌ని సర్రేలో షూట్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. 45 ఏళ్ల మాజీ క్రికెటర్‌ను హడావుడిగా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో అతని ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
సోమవారం ఉదయం టాప్ గేర్ టెస్ట్ ట్రాక్ షూట్ చేసేందుకు ఫ్లింటాఫ్ వచ్చిన సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో ఇంగ్లండ్ మాజీ ప్లేయర్‌కు గాయలయ్యాయని బీబీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన సలహా మేరకు తదుపరి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. త్వరలో దీనిపై మరింత సమాచారం అందిస్తామని చెప్పుకొచ్చింది. ది సన్ ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లింటాఫ్ సాధారణ వేగంతోనే డ్రైవింగ్ చేస్తున్నాడు. అందుకే అతని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది.
ఇది రెండోసారి..
అతివేగం కారణంగా ఫ్లింటాఫ్ తొలిసారి ప్రమాదానికి గురైంది. అతను ఇంతకుముందు 2019 లో టాప్ గేర్ మరొక ఎపిసోడ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదానికి గురయ్యాడు. 2019లో అతివేగం కారణంగా నియంత్రణ కోల్పోయాడు. ఆ సమయంలో అతను 124mph వేగంతో డ్రైవ్ చేశాడు.
2009లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు..
ఆండ్రూ ఫ్లింటాఫ్ ఇంగ్లండ్ తరపున 79 టెస్టులు, 141 పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అతను 2005 యాషెస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ వర్సెస్ ఫ్లింటాప్..
2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్‌ను రెచ్చగొట్టినందుకు ఫ్లింటాఫ్ ప్రతీ భారత అభిమానికి గుర్తుండిపోయాడు. ఫ్లింటాఫ్ తన గొంతు కోస్తానని బెదిరించాడని యువీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత యువీ ఆడిన తుఫాన్ సిక్సులను ప్రపంచం మొత్తం చూసింది. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..