బ్యాటర్లకు సుస్సుపోయించిన ధోని ఫేవరెట్ బౌలర్.. 22 నెలల తర్వాత జట్టులోకి రీ-ఎంట్రీ.. ఎవరంటే.?

వన్డే సిరీస్ ముగిసింది. ఇప్పుడు భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సమరం మొదలైంది. రెండు జట్ల మధ్య చటోగ్రామ్‌ వేదికగా..

బ్యాటర్లకు సుస్సుపోయించిన ధోని ఫేవరెట్ బౌలర్.. 22 నెలల తర్వాత జట్టులోకి రీ-ఎంట్రీ.. ఎవరంటే.?
Team India
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 14, 2022 | 10:14 AM

వన్డే సిరీస్ ముగిసింది. ఇప్పుడు భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సమరం మొదలైంది. రెండు జట్ల మధ్య చటోగ్రామ్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగగా, అందులో కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నాడు. కుల్దీప్ టెస్టు క్రికెట్‌లో చివరిసారిగా 22 నెలల క్రితం ఆడాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే కుల్దీప్ టెస్టుల్లోకి రీ-ఎంట్రీ. ఇంకో విశేషమేమిటంటే, ఈ రోజు కుల్దీప్ యాదవ్ పుట్టినరోజు.. బర్త్‌డే గిఫ్ట్‌గా అతడికి తుది జట్టులో అవకాశం దక్కింది.

కుల్దీప్ యాదవ్‌తో పాటు అశ్విన్, అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‌లో టీమిండియా తరపున బరిలోకి దిగారు. ఈ ముగ్గురిలో కుల్దీప్ ఒక్కడే మణికట్టు స్పిన్నర్. 2022, డిసెంబర్ 14న తన 28వ పుట్టినరోజు జరుపుకుంటున్న కుల్దీప్, చటోగ్రామ్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

22 నెలల తర్వాత కుల్దీప్ టెస్టు క్రికెట్‌లోకి పునరాగమనం..

కుల్దీప్ యాదవ్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 2021లో ఇంగ్లాండ్‌తో చెన్నై వేదికగా ఆడాడు. ఆ టెస్టులో కుల్దీప్ యాదవ్ కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక 22 నెలల తర్వాత ఈరోజు తన 8వ టెస్ట్ మ్యాచ్‌ను ఆడుతున్నాడు. కాగా, కుల్దీప్ ఇంతకుముందు ఆడిన 7 టెస్టుల్లో 26 వికెట్లు పడగొట్టాడు. అందులో 2 సార్లు 4 వికెట్లు, 2 సార్లు 5 వికెట్లు తీశాడు. 2017లో ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ ద్వారా కుల్దీప్ యాదవ్ అరంగేట్రం చేశాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే కుల్దీప్ 68 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.