AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irfan Pathan: నయా ఇన్నింగ్స్‌ మొదలెట్టిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌.. క్రికెటర్ల శుభాకాంక్షల వెల్లువ

Cobra Movie: టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌కు (Irfan Pathan) నయా ఇన్నింగ్స్‌ మొదలెట్టాడు. మైదానంలో స్వింగ్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించిన ఈ మాజీ ఆల్‌రౌండర్‌ ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తాడు.

Irfan Pathan: నయా ఇన్నింగ్స్‌ మొదలెట్టిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌.. క్రికెటర్ల శుభాకాంక్షల వెల్లువ
Irfan Pathan
Basha Shek
| Edited By: |

Updated on: Aug 27, 2022 | 8:05 AM

Share

Cobra Movie: టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌కు (Irfan Pathan) నయా ఇన్నింగ్స్‌ మొదలెట్టాడు. మైదానంలో స్వింగ్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించిన ఈ మాజీ ఆల్‌రౌండర్‌ ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తాడు. మరికొన్ని రోజుల్లో సిల్వర్‌స్ర్కీన్‌పై దర్శనమివ్వనున్నాడు. చియాన్‌ విక్రమ్‌ నటించిన కోబ్రా (Cobra) సినిమాలో పఠాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమిళం, తెలుగుతో పాటు భిన్న భాషల్లో తెరకెక్కిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో ఇర్ఫాన్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో విక్రమ్‌ తో పాటు పఠాన్‌ నటనను సైతం ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.

ఈనేపథ్యంలో వెండితెరకు పరిచయమవుతున్న ఇర్ఫాన్‌కు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ దీపక్‌ హుడా ట్విటర్‌లో కోబ్రా ట్రైలర్‌ను పంచుకుంటూ పఠాన్‌కు అభినందనలు తెలిపాడు. ‘ఈ ట్రైలర్‌ నన్ను ఓ దశాబ్దం పాటు వెనక్కి తీసుకెళ్లింది. జీవితంలో నేను ఏదైనా చేయగలను.. నేనో ఆల్‌రౌండర్‌ను అని ఇర్ఫాన్‌ భాయ్‌ అప్పుడు నాతో అన్న మాటలు గుర్తొచ్చాయి. నీ మాటను నువ్వు నిలబెట్టుకున్నావ్‌. సిల్వర్‌ స్క్రీన్‌పై నిన్ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు హుడా. ఇక సురేశ్‌ రైనా ట్వీట్‌ చేస్తూ.. ‘కోబ్రా సినిమాలో నీ పెర్‌ఫార్మెన్స్‌ను చూడటం నిజంగా ఆనందంగా ఉంది. నీకు, చిత్ర బృందానికి పెద్ద విజయం దక్కాలని కోరుకుంటున్నా. సినిమా చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని రాసుకొచ్చాడు. మరో క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్ప స్పందిస్తూ ‘నీ ప్రయాణంలో మరో అవతారం ఎత్తినందుకు శుభాకాంక్షలు సోదరా. ఎంతో సంతోషంగా ఉంది. కోబ్రాను చూసేందుకు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..