AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోడీ స్టేడియంలో పిచ్‌ను ఆరబెట్టేందుకు హెయిర్‌ డ్రైయర్‌, ఇస్ట్రీ పెట్టెలు ఉపయోగించారా? వైరల్ ఫొటోల వెనక వాస్తవమిదే

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా నరేంద్ర మోడీ స్టేడియానికి పేరుంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా పేరున్న బీసీసీఐ రూ. వందల కోట్లు ఖర్చు చేసి మరీ ఈ స్టేడియాన్ని తీర్చిదిద్దింది. అంతలా పేరుపొందిన మోడీ మైదానంలో పిచ్‌ను ఆరబెట్టేందుకు హెయిర్‌ డ్రైయర్‌, ఇస్ట్రీ పెట్టెలు (ఐరన్‌ బాక్స్‌లు)..

మోడీ స్టేడియంలో పిచ్‌ను ఆరబెట్టేందుకు హెయిర్‌ డ్రైయర్‌, ఇస్ట్రీ పెట్టెలు ఉపయోగించారా? వైరల్ ఫొటోల వెనక వాస్తవమిదే
Ipl 2023 Final
Basha Shek
|

Updated on: May 31, 2023 | 9:03 PM

Share

ఐపీఎల్ 2023 సీజన్‌ ఫైనల్ మ్యాచ్ సోమవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది . చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ( CSK vs GT ) జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడింది. రిజర్వ్‌డే రోజైన సోమవారం కూడా మ్యాచ్‌ మధ్యలో అంతరాయం కలిగించాడు. ఈ సమయంలో పిచ్‌ను ఆరబెట్టేందుకు హెయిర్‌ డ్రైయర్‌, ఇస్ట్రీ పెట్టెలు (ఐరన్‌ బాక్స్‌లు) వాడుతున్నఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా నరేంద్ర మోడీ స్టేడియానికి పేరుంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా పేరున్న బీసీసీఐ రూ. వందల కోట్లు ఖర్చు చేసి మరీ ఈ స్టేడియాన్ని తీర్చిదిద్దింది. అంతలా పేరుపొందిన మోడీ మైదానంలో పిచ్‌ను ఆరబెట్టేందుకు హెయిర్‌ డ్రైయర్‌, ఇస్ట్రీ పెట్టెలు (ఐరన్‌ బాక్స్‌లు), స్పాంజీల ఉపయోగించారంటూ క్రికెట్‌ అభిమానులు విమర్శలు గుప్పించారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజంలేదు. ప్రస్తుతం పిచ్‌ను ఆరబెడుతోన్న ఫొటోలు జనవరి 5, 2020న భారత్-శ్రీలంక మధ్య జరిగే T20 మ్యాచ్‌లో నాటివని బూమ్ ద్వారా ఫ్యాక్ట్ చెక్ నివేదించింది.

మే 29న CSK, GT జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత, మోడీ స్టేడియంలోని పిచ్‌ను ఆరబెట్టడానికి గ్రౌండ్ సిబ్బంది స్పాంజ్‌లను ఉపయోగించి నీటిని తొలగించారు. అలాగే హెయిర్‌ డ్రైయర్‌, ఇస్ట్రీ పెట్టెలను ఉపయోగించి పిచ్‌ను ఆరబెడుతున్న ఫొటోలు వైరలయ్యాయి. BCCI వద్ద భారీ నిధులు ఉన్నాయి. కానీ పిచ్‌ను ఆరబెట్టేందుకు అధునాతన పరికరాలు లేకపోవడం సిగ్గుచేటంటూ నెటిజన్లు ట్రోల్‌ చేశారు. అయితే ఈ ఫొటోలు 2020లో గౌహతిలో భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌నాటివని బూమ్ పేర్కొంది. శ్రీలంకతో టీ20కి ముందు గౌహతి పిచ్‌ను ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్‌లు, స్టీమ్ ఐరన్‌లను ఉపయోగించారని ఫ్యాక్ట్‌ చెక్‌ నివేదించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..