IND vs ENG 1st Test: ఉప్పల్ మ్యాచ్‌లో టాస్ ఓడిన రోహిత్ శర్మ.. కోహ్లీ ప్లేస్‌లో జట్టులోకి ఎవరు వచ్చారంటే?
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎక్కువగా స్పిన్ బౌలర్లను ఎంచుకున్నాయి.

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎక్కువగా స్పిన్ బౌలర్లను ఎంచుకున్నాయి. అంటే ఇరు జట్లలోని ప్లేయింగ్ ఎలెవన్‌లో ముగ్గురేసి స్పిన్నర్లు కనిపించారు. ఇంగ్లండ్ జట్టులో అయితే కేవలం ఒకే ఒక్క ఫాస్ట్ బౌలర్ కనిపించడం గమనార్హం. టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లను స్పిన్ ఆల్‌రౌండర్‌లుగా చేర్చారు. అలాగే వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కేఎస్ భరత్ జట్టులో ఉన్నాడు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా, శుభ్‌మాన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు. అలాగే, ఈ మ్యాచ్‌కు దూరమైన విరాట్ కోహ్లీ స్థానంలో కేఎల్ రాహుల్ లేదా శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ చేయనున్నారు.
హైదరాబాద్ పిచ్ స్పిన్ బౌలర్లకు సహాయకరంగా ఉండడంతో ఇంగ్లండ్ జట్టు తన ప్లేయింగ్ ఎలెవన్‌లో ముగ్గురు స్పిన్నర్లను కూడా రంగంలోకి దించింది. జాక్ లీచ్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ ద్వారా టామ్ హార్ట్లీ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశాడు.
భారత్ ప్లేయింగ్-XI
- రోహిత్ శర్మ (కెప్టెన్)
- యశస్వి జైస్వాల్
- శుభమాన్ గిల్
- శ్రేయాస్ అయ్యర్
- కేఎల్ రాహుల్
- కేఎస్ భరత్ (వికెట్ కీపర్)
- రవీంద్ర జడేజా
- అక్షర్ పటేల్
- రవిచంద్రన్ అశ్విన్
- జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)
- మహ్మద్ సిరాజ్
ఇంగ్లాండ్ యింగ్-XI:
- జాక్ క్రాలే
- బెన్ డకెట్
- ఒల్లీ పోప్
- జో రూట్
- జానీ బెయిర్‌స్టో
- బెన్ స్టోక్స్ (కెప్టెన్)
- బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్)
- రెహాన్ అహ్మద్
- టామ్ హార్ట్లీ
- మార్క్ వుడ్
- జాక్ లీచ్
ఎక్కడ చూడొచ్చంటే?
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టును స్టోర్ట్స్ 18 ఛానల్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అలాగే, జియో సినిమా యాప్‌లో ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.
ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్లు..
Stage set for an action-packed 5-match Test series 🔥
It’s ACTION time in Hyderabad 🤝
Follow the match ▶️ https://t.co/HGTxXf8b1E#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/Hj8FfRulXq
— BCCI (@BCCI) January 25, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




