England vs Netherlands: వన్డేల్లో ప్రపంచ రికార్డ్.. అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఇంగ్లండ్.. ఎంతంటే?
ఇంతకుముందు ఇంగ్లండ్ టీం 6 వికెట్ల నష్టానికి 481 పరుగులు సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయడం ఇది మూడోసారి మాత్రమే. అంతకుముందు 2015లో వెస్టిండీస్, భారత్‌లపై దక్షిణాఫ్రికా ఒక్కో ఇన్నింగ్స్‌లో..
నెదర్లాండ్స్‌పై ఇంగ్లండ్ టీం 4 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ టీం 4 ఏళ్ల క్రితం నమోదు చేసిన రికార్డునే ఆ జట్టే బద్దలు కొట్టింది. టాస్ ఓడిన ఇంగ్లిష్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది. కేవలం రెండు పరుగుల తేడాతో వన్డే క్రికెట్‌లో తొలిసారి 500 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయింది.
ఇంతకుముందు ఇంగ్లండ్ టీం 6 వికెట్ల నష్టానికి 481 పరుగులు సాధించింది. 2018లో నాటింగ్‌హామ్‌లో ఆస్ట్రేలియాపై 19 జూన్ 2018న ఇంగ్లాండ్ జట్టు ఆ స్కోరు సాధించింది. వన్డే చరిత్రలో మూడోసారి ఇంగ్లండ్ తరపున ఫిల్ సాల్ట్ (122), డేవిడ్ మలాన్ (125), జోస్ బట్లర్ (162) ఒక ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు సాధించారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయడం ఇది మూడోసారి మాత్రమే. అంతకుముందు 2015లో వెస్టిండీస్, భారత్‌లపై దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఒక్కో ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు నమోదు చేశారు.
ఇంగ్లాండ్ బ్యాటింగ్ –
• జాసన్ రాయ్ – 1 పరుగు, 7 బంతులు
• ఫిల్ సాల్ట్ – 122 పరుగులు, 93 బంతుల్లో, 14 ఫోర్లు, 3 సిక్సర్లు
• డేవిడ్ మలన్ – 125 పరుగులు, 109 బంతుల్లో, 9 ఫోర్లు, 3 సిక్సర్లు
• జోస్ బట్లర్ – 162 పరుగులు, 70 పరుగులు, 7 ఫోర్లు, 14 సిక్సర్లు
• ఇయాన్ మోర్గాన్ – 0 పరుగులు, 1 బాల్
• లియామ్ లివింగ్‌స్టోన్ – 66 పరుగులు, 22 బంతుల్లో, 6 ఫోర్లు, 6 సిక్సర్లు