IND vs SA Score: హాఫ్ సెంచరీతో అదరగొట్టిన కార్తీక్.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

India vs South Africa: తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 170 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

IND vs SA Score: హాఫ్ సెంచరీతో అదరగొట్టిన కార్తీక్.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
Dinesh Karthik
Follow us

|

Updated on: Jun 17, 2022 | 8:46 PM

India vs South Africa, 4th T20I: రాజ్‌కోట్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది. టెంబా బావుమా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 170 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలినా.. దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా అర్థ సెంచరీ భాగస్వా్మ్యంతో అద్భుతంగా ఆడారు. వీరిద్దరి మధ్య 33 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యం ఉంది. హార్దిక్ పాండ్యా 31 బంతుల్లో 46 పరుగుల చేసి పెవిలియన్ చేరాడు. ఇక హాఫ్ సెంచరీ హీరో దినేష్ కార్తీక్ కేవలం 27 బంతుల్లో 55 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో తన తొలి అంతర్జాతీయ అర్థ సెంచరీ పూర్తి చేసున్నాడు. దినేష్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. టీమిండియా చివరి 5 ఓవర్లలో 73 పరుగులు చేసింది. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 2, జాన్సన్, ప్రెటోరియస్, నార్ట్జే, మహరాజ్ తలో వికెట్ పడగొట్టారు.

పంత్ ఫ్లాప్ షో..

టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. నాలుగో టీ20లో కూడా రిషబ్ బ్యాట్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. 23 బంతులు ఎదుర్కొని కేవలం 17 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని స్ట్రైక్ రేట్ 73.91 మాత్రమే. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో 29, 5, 6 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ..

ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ పెద్దగా రాణించలేక 7 బంతుల్లో 5 పరుగులు చేసి లుంగీ ఎన్‌గిడి బంతికి క్వింటన్ డి కాక్‌కి క్యాచ్ ఇచ్చాడు. 3వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా ఎక్కువసేపు బ్యాటింగ్ చేయలేక కేవలం 4 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సిరీస్‌లో అయ్యర్ బ్యాట్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. వారికి మంచి ఆరంభం లభించినా భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయారు.

టీమిండియా తరుపున అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ కూడా నాలుగో టీ20లో ఆడలేకపోయాడు. ఇషాన్ 26 బంతుల్లో 27 పరుగుల వద్ద ఔటయ్యాడు. అతని వికెట్‌ను ఎన్రిక్ నోర్త్యా తీశాడు.

భారత జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ వరుసగా నాలుగోసారి టాస్ ఓడిపోయాడు. మరోసారి భారత జట్టు తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.

రెండు జట్ల ప్లేయింగ్ XI..

భారత్‌: ఇషాన్ కిషన్, రితురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ మరియు యుజ్వేంద్ర చాహల్.

దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్, టెంబా బావుమా (కెప్టెన్), రెసీ వాన్ డెర్ డ్యూసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిక్ క్లాసెన్, డ్వేన్ ప్రిటోరియస్, మార్కో జెన్సన్, లుంగి ఎన్గిడి, కేశవ్ మహరాజ్, ఎన్రిక్ నోర్త్యా మరియు తబరిజ్ షమ్సీ.