IND vs ENG: సూర్య కోసం సీక్రెట్ మీటింగ్.. ఒకే ఒక్క బాల్‌తో ఆట కట్టిస్తాం.. ఇంగ్లండ్ సారథి స్వీట్ వార్నింగ్..

టీ20 ప్రపంచకప్ 2022లో భారత్-ఇంగ్లండ్ మధ్య గురువారం అడిలైడ్‌లో రెండో సెమీఫైనల్ జరగనుంది. ఈమేరకు సూర్యకుమార్ యాదవ్ కోసం ఇంగ్లాండ్ వ్యూహాన్ని సిద్ధం చేసిందని కెప్టెన్ చెప్పుకొచ్చాడు.

IND vs ENG: సూర్య కోసం సీక్రెట్ మీటింగ్.. ఒకే ఒక్క బాల్‌తో ఆట కట్టిస్తాం.. ఇంగ్లండ్ సారథి స్వీట్ వార్నింగ్..
Surya Kumar
Follow us
Venkata Chari

|

Updated on: Nov 09, 2022 | 3:07 PM

టీ20 ప్రపంచ కప్ 2022లో రెండో సెమీ ఫైనల్ కోసం అడిలైడ్ మైదానం సిద్ధంగా ఉంది. భారత క్రికెట్ జట్టు కూడా తమ ప్రణాళికలను రెడీ చేసింది. అదే సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు మాత్రం టెన్షన్ పడుతున్నారు. దీనికి కారణం సూర్యకుమార్ యాదవ్. 2022 టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న సూర్యకుమార్ యాదవ్.. ఇంగ్లండ్‌ పాలిట అతిపెద్ద టెన్షన్‌గా మారిపోయాడు. మీడియా కథనాల ప్రకారం, అడిలైడ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను ఆపడానికి ఇంగ్లీష్ క్రికెట్ జట్టు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మొత్తం 6గురు పాల్గొన్నారు. ఈ విషయాన్ని కెప్టెన్ జోస్ బట్లర్ కూడా ధృవీకరించాడు. సూర్యకుమార్ యాదవ్‌పై ప్రత్యేక చర్చలు జరిగాయని, ఆయనపై పక్కా ప్లాన్స్ సిద్ధం చేశామని చెప్పుకొచ్చాడు.

జాస్ బట్లర్ మాట్లాడుతూ, ‘మేం సూర్య గురించి చర్చించుకున్నాం. అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కానీ, అతన్ని ఆపడానికి మేం స్కెచ్ వేశాం. ఇది పని చేస్తుందని ఆశిస్తున్నాం. సూర్యకుమార్ యాదవ్ వెరైటీ షాట్లు ఇంగ్లండ్ టీం పాలిట పెద్ద సమస్యగా మారాయి. చాలా మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా సూర్య తరహాలో షాట్లు ఆడినా.. భారత బ్యాటింగ్ మాత్రం మరో స్థాయిలో బ్యాటింగ్ చేస్తోంది.

సూర్యకుమార్‌ను అడ్డుకునేందుకు ఇంగ్లండ్‌ ప్రత్యేక సమావేశం..

ఆంగ్ల మీడియా కథనాల ప్రకారం సూర్యకుమార్‌ను అడ్డుకునేందుకు 6గురు సమావేశమయ్యారు. ఇందులో కోచ్‌లు మాథ్యూ మోట్, కార్ల్ హాప్కిన్సన్, మైఖేల్ హస్సీ, డేవిడ్ సెకర్ ఉన్నారు. దీంతో పాటు కెప్టెన్ జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ కూడా సూర్యను ఆపేందుకు ప్లాన్ వేశారు. జోస్ బట్లర్ మాట్లాడుతూ, ‘సూర్యకుమార్ బ్యాటింగ్ చూడటం సరదాగా ఉంటుంది. అతనికి చాలా షాట్లు ఉన్నాయి. కానీ, ఒక బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయడానికి ఒక బంతి మాత్రమే అవసరం. మేం దానిని ప్రయత్నిస్తాం’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

సూర్యకుమార్‌ ఇంగ్లండ్‌కు ఎందుకు ముప్పు?

ఇంగ్లండ్‌కు అద్భుతమైన పేస్, స్పిన్ అటాక్ ఉన్నప్పటికీ, సమస్య ఏమిటంటే సూర్యకుమార్ యాదవ్ రెండు రకాల బౌలర్లను బాగా ఆడటమే. అతను మార్క్ వుడ్ వేగాన్ని మెరుగైన మార్గంలో ఉపయోగించగలడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో ఇంగ్లండ్‌తో జరిగిన నాటింగ్‌హామ్ టీ20లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.

టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన పరంగా సూర్యకుమార్ మూడో స్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్ 3 అర్ధ సెంచరీలతో సహా 75 సగటుతో 225 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ స్ట్రైక్ రేట్ 190కి పైగా ఉండటం బౌలర్లకు పెను ముప్పుగా మారనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..