NZ vs PAK: హాఫ్ సెంచరీతో మెరిసిన మిచెల్.. బాబర్ సేన టార్గెట్ 153..
T20 World Cup 2022: కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ జట్టు ముందు 153 పరుగుల టార్గెట్ ఉంది.

Pakistan vs New Zealand: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ జరుగుతోంది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని పాకిస్థాన్‌కు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాడు. ప్రారంభంలో ఒడిదొడుకుల తర్వాత, విలియమ్సన్ 46 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. డారిల్ మిచెల్‌తో కలిసి 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత మిచెల్ 53 పరుగులు చేసి జట్టుకు పోరాడే స్కోరుకు తీసుకెళ్లాడు.
పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ షా ఆఫ్రిది 2 వికెట్లు తీశాడు. 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. షాదాబ్ డైరెక్ట్ హిట్‌లో నవాజ్‌కు ఒక వికెట్ లభించింది.




50 for @dazmitchell47! Brings it up from 32 balls. His second in a @T20WorldCup semi-final. Follow play LIVE in NZ with @skysportnz and @SENZ_Radio. LIVE scoring | https://t.co/jvdg2JukFe #T20WorldCup pic.twitter.com/D2nn3dhuhF
— BLACKCAPS (@BLACKCAPS) November 9, 2022
ఇరుజట్లు:
పాకిస్థాన్ ప్లేయింగ్ XI: మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది
న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(కీపర్), కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




