NZ vs PAK: ఫైనల్ టికెట్ పాకిస్తాన్‌దే.. మరోసారి ఆ సెంటిమెంట్‌కే బలైన కివీస్.. అందరి చూపు రేపటి మ్యాచ్‌పైనే..

న్యూజిలాండ్‌పై కలిసి కట్టుగా రాణించిన పాక్ జట్లు.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్ టికెట్ దక్కించుకుంది.

NZ vs PAK: ఫైనల్ టికెట్ పాకిస్తాన్‌దే.. మరోసారి ఆ సెంటిమెంట్‌కే బలైన కివీస్.. అందరి చూపు రేపటి మ్యాచ్‌పైనే..
Nz Vs Pak Result
Follow us

|

Updated on: Nov 09, 2022 | 5:17 PM

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20 ప్రపంచ కప్ 2022 లో  ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా పాకిస్థాన్‌ నిలిచింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ పాకిస్తాన్ జట్టు రాణించింది. న్యూజిలాండ్‌పై కలిసి కట్టుగా రాణించిన పాక్ జట్టు.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్ టికెట్ దక్కించుకుంది. అంతకుముందు కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని పాకిస్థాన్‌కు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాడు.  లక్ష్యాన్ని చేధించిన పాకిస్థాన్.. 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. 13 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ ఫైనల్‌కు చేరుకుంది. 2007లో ఆడిన తొలి టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కు చేరినా విజయం సాధించలేకపోయింది. చివరిసారిగా 2009లో ఆడిన టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరి టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

ఈ ప్రపంచకప్‌లో ఓపెనర్లు బాబర్-రిజ్వాన్ పవర్ ప్లేలో తొలిసారిగా 50 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. బాబర్ ఆజం 42 బంతుల్లో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. రిజ్వాన్‌తో కలిసి ఓపెనింగ్ వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం రిజ్వాన్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 57 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మొత్తంగా 3 వికెట్లు కోల్పోయి చివరి ఓవర్లో టార్గెట్ ను ఛేదించింది.

2009 ఛాంపియన్ పాకిస్థాన్ సూపర్ 12 మ్యాచ్‌ల చివరి రోజున సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. నెదర్లాండ్స్ టీం దక్షిణాఫ్రికాను ఓడించడంతో పాక్ అదృష్టం కూడా ఇందులో పెద్ద పాత్ర పోషించింది. అయితే, ఇప్పుడు బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టు సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టుపై అద్భుతంగా ఆకట్టుకుంది. గణాంకాల పరంగా చూస్తే పాకిస్థాన్‌దే పైచేయిగా నిలిచింది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 28 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో పాకిస్థాన్ 17, న్యూజిలాండ్ 11 గెలిచాయి.

ఇవి కూడా చదవండి

మిచెల్ ఫిఫ్టీ..

న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ 53 పరుగులు చేశాడు. అతను జిమ్మీ నీషమ్‌తో కలిసి 22 బంతుల్లో 32 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. మిచెల్ బ్యాటింగ్ కారణంగా న్యూజిలాండ్ స్కోరు 150కి చేరింది.

విలియమ్సన్ కీలక ఇన్నింగ్స్..

సెమీఫైనల్ లాంటి భారీ మ్యాచ్ లో కెప్టెన్ విలియమ్సన్ 46 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. డారిల్ మిచెల్‌తో కలిసి, అతను 50 బంతుల్లో 68 పరుగుల భాగస్వామ్యంతో జట్టును తొలి వైఫల్యం నుంచి గట్టెక్కించాడు.

షాహీన్ అద్భుత బౌలింగ్‌లో..

షాహీన్ షా ఆఫ్రిది 2 వికెట్లు తీశాడు. అతను కీలక సందర్భాల్లో ఓపెనర్ ఫిన్ అలెన్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ వికెట్లు పడగొట్టాడు. మరీ ముఖ్యంగా, అతను 4 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఎకానమీ 6తో పరుగులు ఇచ్చాడు.

ఇరుజట్లు:

పాకిస్థాన్ ప్లేయింగ్ XI: మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది

న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(కీపర్), కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..