AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Eng: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. హిట్‌మ్యాన్ ఫిట్.. పంత్-కార్తీక్‌లో సెమీస్ ఆడేది ఎవరంటే?

టీ20 ప్రపంచకప్ 2022 రెండో సెమీఫైనల్‌లో భారత్-ఇంగ్లండ్ తలపడనుండగా, కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్‌కు ఫిట్‌గా ఉన్నాడు.

Ind vs Eng: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. హిట్‌మ్యాన్ ఫిట్.. పంత్-కార్తీక్‌లో సెమీస్ ఆడేది ఎవరంటే?
Rohit Sharma
Venkata Chari
|

Updated on: Nov 09, 2022 | 12:26 PM

Share

టీ20 ప్రపంచకప్ 2022 రెండో సెమీఫైనల్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. మంగళవారం ప్రాక్టీస్‌లో రోహిత్ శర్మ గాయపడిన విషయం తెలిసిందే. త్రో డౌన్ స్పెషలిస్ట్ రఘు వేసిన బంతి రోహిత్ శర్మ చేతికి తగిలింది. ఆ తర్వాత అతను చాలా నొప్పితో బాధపడ్డాడు. అయితే ఆ తర్వాత అతను ప్రాక్టీస్‌ను కొనసాగించాడు. ఇప్పుడు రోహిత్ శర్మ తన గాయం గురించి అప్‌డేట్ ఇచ్చాడు. తాను పూర్తిగా ఫిట్‌గా ఉన్నానని, టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో ఆడతానని రోహిత్ శర్మ తెలిపాడు. దీంతో రోహిత్ ఫిట్ నెస్‌పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లైంది.

రోహిత్ శర్మ మాట్లాడుతూ, ‘మంగళవారం నా చేతికి బంతి తగిలింది. కానీ ఇప్పుడు అది పూర్తిగా నయమైంది. చేతికి కాస్త గుర్తు ఉన్నా ఇప్పుడు పూర్తిగా నొప్పి తగ్గింది’ అని చెప్పుకొచ్చాడు. ఇది కాకుండా, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ విషయంలో కూడా రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం ఎవరు ఆడతారో స్పష్టంగా చెప్పలేదు.

కార్తీక్, పంత్‌లలో సెమీ ఫైనల్స్‌లో ఆడేది ఎవరు?

రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్‌ల ఎంపిక అంశంపై రోహిత్ శర్మ మాట్లాడుతూ.. వారిద్దరూ ఈక్వేషన్‌లోనే ఉంటారని అన్నారు. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరు ఆడతారో రోహిత్ శర్మ స్పష్టంగా చెప్పలేదు. మీడియా నివేదికల ప్రకారం, కార్తీక్ కంటే రిషబ్ పంత్‌కే ప్రాధాన్యత ఇవ్వవచ్చని తెలుస్తోంది. కార్తీక్ ఈ టోర్నీలో వరుసగా విఫలమవుతున్నాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌గా రిషబ్ పంత్ కొంచెం సేఫ్ జోన్‌లో ఉన్నాడు.

సూర్యకుమార్‌పై ప్రశంసల జల్లు..

రోహిత్ శర్మ కూడా సూర్యకుమార్ యాదవ్‌ను ప్రశంసించాడు. రోహిత్ మాట్లాడుతూ.. ‘ప్రతి సందర్భంలోనూ స్వేచ్ఛగా ఆడటం సూర్యకుమార్‌కు అలవాటు. స్కోరు 10 పరుగులకు 2 వికెట్లు లేదా 100 పరుగులకు 2 వికెట్లు ఉన్నా పట్టించుకోడు. సూర్యకుమార్ ఒత్తిడిని ఇష్టపడతాడు. అతను అదనపు ఒత్తిడిలో ఆడటం ఆనందిస్తాడు. దాని పరిధి అపరిమితంగా ఉంటుంది’ అని అన్నాడు. అదే సమయంలో, సూర్యకుమార్ యాదవ్ భారీ మైదానాలను ఇష్టపడతాడని రోహిత్ శర్మ వెల్లడించాడు.

ఇంగ్లండ్ బలమైన ప్రత్యర్థి – రోహిత్

ఇంగ్లండ్‌ను బలమైన ప్రత్యర్థిగా రోహిత్ శర్మ అభివర్ణించాడు. ఇంగ్లీష్ జట్టు ప్రమాదకరమైనది. వారు ఎవరినైనా ఓడించగలరు. ‘నాకౌట్ మ్యాచ్‌లలో ప్రదర్శన ముఖ్యం. కానీ, కెరీర్ విషయంలోనూ ఇలాంటి మ్యాచ్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక నాకౌట్ మ్యాచ్‌తో ఆటగాడి కెరీర్ మొత్తం మారిపోతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..