Ollie Robinson: అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఓలీ రాబిన్‌సన్ సస్పెండ్.. విచారణకు ఆదేశించిన ఇంగ్లాండ్ బోర్డు..
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు జాతీయ జట్టులోని ఆటగాడి పట్ల సంచలన నిర్ణయం తీసుకుంది. ఆల్‌రౌండర్ ఓలీ రాబిన్‌సన్‌ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి...
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ ఓలీ రాబిన్‌సన్‌ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. 2012-13లో రాబిన్‌సన్ చేసిన రేసిస్ట్, సెక్సిస్ట్ ట్వీట్లపై తాజాగా పెద్ద దుమారం రేగిన నేపధ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గురువారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు దూరమైన ఆల్‌రౌండర్ ఓలీ రాబిన్‌సన్ ఇంగ్లాండ్ క్యాంప్ నుంచి తిరిగి సస్సెక్స్ చేరుకున్నాడు.
జూన్ 3 న, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ ప్రారంభంలోనే 2012-13 మధ్యకాలంలో లింగ వివక్ష, జాత్యహంకారానికి సంబంధించిన అనేక ట్వీట్‌లకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఆల్‌రౌండర్ ఓలీ రాబిన్‌సన్ తుది జట్టులో చోటు దక్కించుకున్న తర్వాత ఈ ట్వీట్లు ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. “నా చర్యలకు నేను చింతిస్తున్నాను. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను” అని ఓలీ రాబిన్‌సన్ తన చేసిన ట్వీట్లకు క్షమాపణలు చెప్పాడు.
”నేను ఆలోచనా రహితంగా, బాధ్యతా రహితంగా ఉన్నానని, అప్పుడు నా మానసిక స్థితి ఏమైనప్పటికీ, నా పని క్షమించరానిదని” ఓలీ రాబిన్‌సన్ చెప్పాడు. తన జీవితం అత్యంత ఘోరమైన దశలో ఉన్నప్పుడు తాను ఈ ట్వీట్లు చేశానని, ఇంగ్లీష్ కౌంటీ యార్క్‌షైర్ తనను యుక్తవయసులో తరిమేసిందని అతడు పేర్కొన్నాడు. ”ఆ ట్వీట్లు ఇప్పటికీ ఉన్నాయో లేదో నాకు తెలియదు. నేను అందరికీ క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. దీని గురించి నేను చాలా బాధపడుతున్నాను” అని రాబిన్‌సన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
Also Read:
ఈ ఆహార పదార్ధాలను పెరుగుతో పాటు అస్సలు తినకూడదు.! చాలా డేంజర్.. అవేంటంటే..
దట్టమైన అడవిలో ఊగుతూ కనిపించిన మర్మమైన బొమ్మ.. గగుర్పొడిచే దృశ్యం.. చివరికి ట్విస్ట్ ఏంటంటే.?