Viral: లైవ్ మ్యాచ్‌లో ఇవేం బిత్తిరి చూపులు బ్రో.. అద్భుత అవకాశాన్ని ఇంత సింపుల్‌గా వదిలేస్తారా.. వీడియో చూస్తే నవ్వులే.

న్యూజిలాండ్‌తో జరుగుతున్న డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఆతిథ్య జట్టుపై 98 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి 325 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

Viral: లైవ్ మ్యాచ్‌లో ఇవేం బిత్తిరి చూపులు బ్రో.. అద్భుత అవకాశాన్ని ఇంత సింపుల్‌గా వదిలేస్తారా.. వీడియో చూస్తే నవ్వులే.
New Zealand Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Feb 18, 2023 | 6:56 AM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఆతిథ్య జట్టుపై 98 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి 325 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత టామ్ బ్లండెల్ సెంచరీ ఇన్నింగ్స్ 138 పరుగుల ఆధారంగా న్యూజిలాండ్ 306 పరుగులు చేయగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. అయితే రెండో రోజు న్యూజిలాండ్ ఫీల్డర్లు ఘోర తప్పిదం చేశారు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అయితే, ఈ తప్పిదంలో ఒక వికెట్ పడకుండా ఇంగ్లండ్‌కు ప్రయోజనం చేకూరింది. ఇంగ్లండ్ నంబర్ త్రీ బ్యాట్స్‌మెన్ ఓలీ పోప్ 14 పరుగులతో ఆడుతున్నాడు. అతనితో పాటు నైట్ వాచ్‌మెన్ స్టువర్ట్ బ్రాడ్ ఆరు పరుగులతో ఆడుతున్నాడు.

ఇవి కూడా చదవండి

బౌలర్, వికెట్ కీపర్ చేసిన తప్పిదం..

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ కొనసాగుతోంది. స్కాట్ కుగ్గెలీజిన్ ఓవర్ విసురుతున్నాడు. బౌలర్ బౌన్సర్‌ను బౌల్ చేశాడు. బ్రాడ్ దానిని ముందుకు ఆడడానికి ప్రయత్నించాడు. కానీ, బంతి బ్రాడ్ బ్యాట్ టాప్ ఎడ్జ్‌ను తీసుకొని గాలిలోకి వెళ్ళింది. బంతి గాలిలోకి ఎగిరింది. బౌలర్ కాకుండా, వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ క్యాచ్ కోసం పరుగెత్తాడు. ఒక ఎండ్‌ నుంచి వికెట్‌ కీపర్‌, మరో ఎండ్‌ నుంచి బౌలర్‌ క్యాచ్‌ కోసం వస్తున్నారు. అయితే సరైన సమయంలో క్యాచ్‌ను అందుకోవడానికి ఇద్దరూ కాల్ చేసుకోలేదు. దీంతో న్యూజిలాండ్ నుంచి మూడో వికెట్ తీసే అవకాశం చేజారింది. ఆ సమయంలో బ్రాడ్ ఖాతా కూడా తెరవలేక పోవడంతో ఇంగ్లండ్ స్కోరు 68 పరుగులుగా నిలిచింది.

న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 37 పరుగులతో రోజు ఆట ప్రారంభించింది. డెవాన్ కాన్వే, నీల్ వాగ్నర్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. కాన్వే 77 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, బ్లండెల్ 138 పరుగులు చేశాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌ల బలంతో న్యూజిలాండ్ 306 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలీ, బెన్ డకెట్ వికెట్లను కోల్పోయింది. ఇంగ్లండ్ 27 బంతుల్లో 25 పరుగులు చేయగలిగిన బెన్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. 52 పరుగుల వద్ద అతని వికెట్ పడిపోయింది. మొత్తం స్కోరు 68 వద్ద జాక్ అవుట్ కాగా.. 28 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ హీరోయిన్.. ఈ హాట్ బ్యూటీ ఇద్దరూ ఒకటేనా..!!
ఆ హీరోయిన్.. ఈ హాట్ బ్యూటీ ఇద్దరూ ఒకటేనా..!!
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..