India vs England: బ్యాడ్‌ న్యూస్‌, మూడో టెస్ట్‌కు దూరమైన అశ్విన్‌.. కారణం ఏంటంటే..

ఇదిలా ఉంటే కుటుంబంలో నెలకొన్న మెడికల్‌ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్‌ మ్యాచ్‌కు దూరమవుతున్నట్లు బీసీసీఐ 'ఎక్స్‌' (ట్విట్టర్‌) వేదికగా ప్రకటించింది. ఈ కష్ట సమయంలో అశ్విన్‌కు జట్టుతో పాటు బోర్డు అండగా ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగానే అశ్విన్‌ మ్యాచ్‌కు దూరమైనట్లు...

India vs England: బ్యాడ్‌ న్యూస్‌, మూడో టెస్ట్‌కు దూరమైన అశ్విన్‌.. కారణం ఏంటంటే..
Ashwin
Follow us

|

Updated on: Feb 17, 2024 | 8:20 AM

భారత క్రికెట్‌ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్‌ అని చెప్పాలి. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌ నుంచి భారత బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ దూరమయ్యాడు. మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో 37 పరుగులు చేసి మంచి పాట్నర్‌షిప్‌ను అందించిన అశ్విన్‌ మ్యాచ్‌కు దూరం కావడం టీమిండియాకు ఎదురుదెబ్బ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ అశ్విన్‌ ఈ మ్యాచ్‌లో భాగంగా శుక్రవారం తీసిన వికెట్‌తో 500 వికెట్ల క్లబ్‌లో చేరిన జోష్‌లో ఉన్నాడు.

ఇదిలా ఉంటే కుటుంబంలో నెలకొన్న మెడికల్‌ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్‌ మ్యాచ్‌కు దూరమవుతున్నట్లు బీసీసీఐ ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌) వేదికగా ప్రకటించింది. ఈ కష్ట సమయంలో అశ్విన్‌కు జట్టుతో పాటు బోర్డు అండగా ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగానే అశ్విన్‌ మ్యాచ్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. ఇదే విషయమై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పోస్టు చేశారు.

తన తల్లికి దగ్గరగా ఉండడం కోసమే అశ్విన్‌ రోజ్‌కోట్‌ నుంచి చెన్నై వెళ్లినట్లు ఆయన రాసుకొచ్చారు. అశ్విన్‌ తల్లి త్వరగా కోలుకోవాలని రాజీవ్‌ శుక్లా ఆకాంక్షించారు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా, అభిమానులు అశ్విన్‌, అతడి కుటుంబ సభ్యుల గొప్యతకు భంగం కలిగించకుండా ఉండాలని బీసీసీఐ బోర్డు పేర్కొంది. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు తమకు ఎంతో ముఖ్యమని తెలిపింది.

ఇదిలా ఉంటే రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతోన్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఇక రెండో బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ 2 వికెట్ల నష్టానికి 207 రన్స్‌ చేసింది. భారత బౌలర్లలో సిరాజ్‌, అశ్విన్‌ చెరో వికెట్‌ తీశారు. ఇంగ్లండ్‌ బ్యాటర్స్‌ను కట్టడి చేసే ఇలాంటి తరుణంలో అశ్విన్‌ మ్యాచ్‌కు దూరం కావడం టీమిండియాకు ఇబ్బందిగా మారుంతనడంలో సందేహం లేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..