Video: ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్.. కట్‌చేస్తే.. 6, 6, 6 హ్యాట్రిక్ సిక్స్‌లతో 39 బంతుల్లోనే బీభత్సం
Paarl Royals vs Joburg Super Kings: దక్షిణాఫ్రికా SA20 లీగ్‌లో తొలిసారిగా ఆడుతున్న దినేష్ కార్తీక్ జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో బరిలోకి వచ్చాడు. కేవలం 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పార్ల్ రాయల్స్‌ను కార్తీక్ తన బలమైన హాఫ్ సెంచరీతో ఆదుకొని పోరాడే స్కోర్‌కు జట్టును చేర్చాడు.

దినేష్ కార్తీక్ అంతర్జాతీయ క్రికెట్, దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ నుంచి రిటైర్ అయినప్పటికీ, అతను ఎక్కువ సమయం వ్యాఖ్యానంలో కనిపిస్తున్నాడు. అయితే, తాజాగా ఎస్‌ఏ20 లీగ్‌లో బరిలోకి దిగిని దినేష్ కార్తీక్.. తన బ్యాట్‌తో పాత ఫాంతో రెచ్చిపోతున్నాు. ఇప్పటికీ అదే ఊపుతూ ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో తన బ్యాట్ పవర్ చూపించినన ‘డీకే’ ఇప్పుడు దక్షిణాఫ్రికాలో కూడా అదే తుఫాను వైఖరిని ప్రదర్శించడం ప్రారంభించాడు. దక్షిణాఫ్రికా లీగ్ SA20లో తొలిసారిగా ఆడుతున్న కార్తీక్.. జోబర్గ్ సూపర్ కింగ్స్‌పై హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి, బలమైన ఇన్నింగ్స్‌తో కష్టాల్లో ఉన్న జట్టును కాపాడాడు.
జనవరి 30 గురువారం సాయంత్రం జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ జట్టు పార్ల్ రాయల్స్ సూపర్ కింగ్స్‌తో తలపడ్డాయి. ఈ మొత్తం సీజన్‌లో, పార్ల్ రాయల్స్ ఇప్పటివరకు అత్యధిక విజయాలతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రతి మ్యాచ్‌లోనూ వేర్వేరు ఆటగాళ్లు జట్టుకు కీలక పాత్ర పోషించడమే ఇందుకు కారణం. ఈసారి నిరాశపరచని కార్తీక్ వంతు వచ్చింది. కేవలం 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన తన జట్టును 150 పరుగుల విలువైన స్కోరుకు చేర్చాడు.
హ్యాట్రిక్ సిక్సర్లతో తుఫాను హాఫ్ సెంచరీ..
Dinesh Karthik goes boom 💥#BetwaySA20 #JSKvPR #WelcomeToIncredible | @DineshKarthik pic.twitter.com/OrdBdo4pp2
— Betway SA20 (@SA20_League) January 30, 2025
కార్తీక్ బ్యాటింగ్ కు వచ్చే సమయానికి, పార్ల్ 5.1 ఓవర్లలో కేవలం 40 పరుగులకే నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 68 పరుగుల వద్ద 5వ వికెట్ కూడా పడిపోయింది. ఇటువంటి పరిస్థితిలో, బాధ్యత అంతా సీనియర్ బ్యాట్స్‌మన్ కార్తీక్‌పైనే ఉంది. భారత మాజీ వికెట్ కీపర్ తన అనుభవాన్ని పంచుకుని జో’బర్గ్ బౌలర్లకు గుణపాఠం నేర్పాడు. కార్తీక్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సమయంలో, 13వ ఓవర్లో, కార్తీక్ స్పిన్నర్ విహాన్ లూబా బంతులను వరుసగా 3 సిక్సర్లు కొట్టి సంచలనం సృష్టించాడు.
కష్టాల నుంచి జట్టును రక్షించిన డీకే..
ఈ సమయంలో, కార్తీక్ SA20లో తన మొదటి అర్ధ సెంచరీని కూడా పూర్తి చేశాడు. అతను జట్టును భారీ స్కోరుకు తీసుకెళ్లడం కనిపించింది. అయితే, 18వ ఓవర్లో ఇమ్రాన్ తాహిర్ తన వికెట్‌ను తీశాడు. కార్తీక్ 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. అతను ఔట్ అయిన వెంటనే, మిగిలిన బ్యాట్స్‌మెన్ మరో 12 పరుగులు మాత్రమే జోడించగలిగారు. అయితే, ఈ స్కోరు జట్టును మ్యాచ్‌లో నిలబెట్టడానికి సరిపోతుంది. కార్తీక్ మినహా రూబిన్ హర్మన్ మాత్రమే కొంత సహకారం అందించి 28 పరుగులు చేశాడు. జోబర్గ్ తరఫున డోనోవన్ ఫెరీరా, లుథో సిపమల 3-3 వికెట్లు తీశారు.
ఫలించని డీకే పోరాటం..
అనంతరం 151 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన జోబర్గ్ సూపర్ కింగ్స్ కేవలం 17. 5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..