IPL 2024: మొన్న ఓడినా సూపర్ హీరోగా పొగడ్తలు.. కట్‌చేస్తే.. నిన్న ఓటమితో విలన్‌గా తిట్లు.. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దంటోన్న ఫ్యాన్స్
Dinesh Karthik: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 36వ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే ఈ పోరులో RCB కేవలం 1 పరుగు తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. ఈ ఓటమికి ప్రధాన కారణం దినేష్ కార్తీక్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. 19వ ఓవర్లో డీకే చూపిన అతి విశ్వాసమే ఇందుకు కారణం అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొన్న జరిగిన మ్యాచ్‌లో తీవ్రంగా పోరాడిన డీకే హీరోగా నిలిచాడు. కానీ, గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో అత్యుత్సాహంతో ఓటమికి కారణమయ్యాడు.

Dinesh Karthik: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17లో RCB 7వ సారి ఓడిపోయింది. అయితే ఈసారి ఓటమికి 1 పరుగు మాత్రమే ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ చివరి బంతికి ఓడిపోయింది. అది కూడా ఆల్ ఔట్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఈ కఠినమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ ధీటైన పోరాటాన్ని ప్రదర్శించింది. ఫలితంగా చివరి 12 బంతుల్లో RCB జట్టుకు 31 పరుగులు అవసరం అయ్యాయి.
క్రీజులో దినేష్ కార్తీక్, కర్ణ్ శర్మ ఉన్నారు. దాంతో ఆర్సీబీ టీమ్ ఛేజింగ్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, ఆండ్రీ రస్సెల్ వేసిన 19వ ఓవర్ తొలి రెండు బంతుల్లో దినేష్ కార్తీక్ పరుగులేమీ చేయలేదు. మూడో బంతికి సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత 4వ బంతికి పరుగు చేసేందుకు నిరాకరించాడు. 5వ బంతికి ఫోర్ కొట్టాడు. చివరి బంతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక్కడ గమనించవలసిన ప్రధాన విషయం ఏమిటంటే, దినేష్ కార్తీక్ కర్ణ్ శర్మకు 1 పరుగు తీసేందుకు మూడుసార్లు రన్ చేసే అవకాశం ఉన్నప్పటికీ స్ట్రైక్ ఇవ్వడానికి నిరాకరించాడు.
ఆర్‌సీబీ జట్టులో ఆల్‌రౌండర్‌గా చోటు దక్కించుకున్న కర్ణ్ శర్మపై దినేష్ కార్తీక్‌కు కనీస విశ్వాసం లేదు. అలాగే తానే పూర్తి చేస్తానన్న అతి విశ్వాసంతో డీకే బ్యాట్ ఝుళిపించారు. కానీ, తన ప్లాన్ వర్క్ ఔట్ కాకపోడంతో ప్రస్తుతం ఆయనపై ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఫలితంగా 19వ ఓవర్‌లో RCB 10 పరుగులు చేసింది. చివరి ఓవర్లో 21 పరుగుల విజయలక్ష్యం ఉంది. ఈ క్రమంలో కర్ణ్ శర్మ.. ఫినిషర్‌కు ఏమాత్రం తగ్గలేదంటూ మిచెల్ స్టార్క్‌పై వరుస సిక్సులు బాదాడు. కానీ 5వ బంతికి స్టార్క్ వేసిన అద్భుత క్యాచ్ కారణంగా కర్ణ్ శర్మ ఔట్ కావాల్సి వచ్చింది.
చివరకు RCB జట్టు 1 పరుగు తేడాతో ఓడిపోయింది. 19వ ఓవర్లో వచ్చిన 3 అవకాశాల్లో డీకే కనీసం 1 పరుగు చేసి ఉంటే, RCB మ్యాచ్ గెలిచి ఉండేది. అయితే, దినేష్ కార్తీక్ మితిమీరిన ఆత్మవిశ్వాసమే ఆర్సీబీ జట్టును చిత్తు చేసిందని ట్రోల్స్ చేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








