ICC Player of the Month: భారత ఆటగాళ్లకు మరోసారి నిరాశే.. రేసులో ఉన్నా అవార్డులు దక్కలే..!

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుల్లో టీమిండియా ఆటగాళ్లకు చుక్కెదురైంది. తాజాగా జూన్ నెలకు గాను ప్రకటించిన ఫలితాల్లో పురుషుల నుంచి న్యూజిలాండ్ క్రికెటర్ డెవాన్ కాన్వే, మహిళల నుంచి ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎంపికయ్యారు.

ICC Player of the Month: భారత ఆటగాళ్లకు మరోసారి నిరాశే.. రేసులో ఉన్నా అవార్డులు దక్కలే..!
Icc Player Of The Month
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Venkata Chari

Updated on: Jul 12, 2021 | 8:44 PM

ICC Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుల్లో టీమిండియా ఆటగాళ్లకు చుక్కెదురైంది. తాజాగా జూన్ నెలకు గాను ప్రకటించిన ఫలితాల్లో పురుషుల నుంచి న్యూజిలాండ్ క్రికెటర్ డెవాన్ కాన్వే, మహిళల నుంచి ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎంపికయ్యారు. కాగా, పురుషుల విభాగం నుంచి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం డెవాన్ కాన్వేతో పాటు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్‌ కైల్‌ జేమీసన్‌, దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్‌ డికాక్ పోటీపడ్డారు. వీరందరిని దాటుకుని కివీస్ బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎన్నికయ్యాడు. అలాగే ఐసీసీ నుంచి ఈ అవార్డు అందుకున్న మొదటి న్యూజిలాండ్ ఆటగాడిగా కాన్వే చరిత్ర నెలకొల్పాడు. అయితే, జూన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన డెవాన్ కాన్వే.. తొలి టెస్ట్‌లోనే డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం భారత్‌తో జరిగిన డబ్యూటీసీ ఫైనల్లోనూ రాణించాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు టెస్ట్‌ల్లో డబుల్‌ సెంచరీ, రెండు హాఫ్‌ సెంచరీలతో దూసుకపోతున్నాడు.

ఇక మహిళల విషయానికి వస్తే… ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో టీమిండియా సంచలనం షెఫాలీ వ‌ర్మ, మరో ప్లేయర్ స్నేహ్ రాణా పోటీ పడ్డారు. కానీ, వీరిని వెనక్కి నెట్టి ఇంగ్లండ్ ప్లేయర్ ఎక్లెస్టోన్‌ ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్‌గా ఎన్నికైంది. పోటీలో ఉండి అవార్డు దక్కించుకోవడంలో టీమిండియా ప్లేయర్స్‌ విఫలమయ్యారు. దీంతో మరోసారి భాతర్ ఆటగాళ్లకు నిరాశే మిగిలింది. భారత మహిళలో జ‌రిగిన ఏకైక టెస్ట్‌లో ఈ ఇంగ్లండ్ బౌలర్ 8 వికెట్లు తీసి సత్తా చాటింది. అలాగే అనంతరం జ‌రిగిన రెండు వ‌న్డేల్లో సోఫీ ఎక్లెస్టోన్ మూడేసి వికెట్లు పడగొట్టింది. దాంతో అత్యధిక రేటింగ్‌ పాయింట్లతో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద అవార్డును సొంతం చేసుకుంది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌ తో అరంగేట్రం చేసిన షెఫాలి వర్మ.. అర్థ సెంచరీలతో ఆకట్టుకుంది. టీమిండియా ఆల్‌రౌండర్‌ స్నేహ్‌ రాణా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుని, ఎకైక టెస్టును డ్రా చేయడంలో కీలక పాత్రం పోషించింది.

Also Read:

Ravichandran Ashwin: కౌంటీ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ అరుదైన రికార్డు..!

Viral Video: చిన్నారి అభిమానానికి సెర్బియా దిగ్గజం ఫిదా… బహుమతిగా ఏమిచ్చాడో తెలుసా?

India tour of Sri Lanka: ఇట్స్ అఫీషియల్.. ఐదు రోజులు ఆలస్యంగా సిరీస్ రీ-స్టార్ట్.. షెడ్యూల్ ఇదే.!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?