Ravichandran Ashwin: కౌంటీ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ అరుదైన రికార్డు..!

టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టులో ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు.

Ravichandran Ashwin: కౌంటీ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ అరుదైన రికార్డు..!
Ravichandran Ashwin
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Venkata Chari

Updated on: Jul 12, 2021 | 8:36 PM

Ravichandran Ashwin: టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టులో ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 11 ఏళ్ల తరువాత కౌంటీ క్రికెట్లో తొలి ఓవర్‌ను బౌల్ చేసి రికార్డ్ క్రియోట్ చేశాడు. 2010లో న్యూజిలాండ్ స్పిన్నర్ జీతన్ పటేల్ తొలి ఓవర్ విసరగా.. మరలా ఇన్నాళ్లకు టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ ఈ రికార్డును నెలకొల్పాడు. ఇన్నింగ్స్ తొలి బంతిని వేసిన అశ్విన్.. మ్యాచ్ మొత్తంలో 28 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఆదివారం సోమర్‌సెట్‌తో జరిగిన కౌంటీ మ్యాచ్‌లో సర్రే టీం తరపున అశ్విన్ బరిలోకి దిగాడు. పిచ్ మందకొడిగా ఉండడంతో.. సర్రే కెప్టెన్ రోరీ బర్న్స్.. అశ్విన్‌కు తొలి ఓవర్ బౌలింగ్ చేసే అవకాశాన్ని అందించాడు. 70 పరుగులిచ్చిన అశ్విన్.. ఓ వికెట్ పడగొట్టాడు.

తొలిరోజు ఆట ముగిసే సమయానికి సోమర్‌సెట్‌ 280 పరుగులు చేసింది. 98 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్‌తో టీమిండియా ఇదే మైదానంలో నాలుగో టెస్టు ఆడనుంది. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు విరామంలో ఉన్నారు. లండన్ పరిసరాల్లో కుటుంబాలతో కలిసి విహరిస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలసిందే. ఈ టెస్టు తరువాత ఇంగ్లండ్‌తో జరగబోయే 5 టెస్టుల సిరీస్‌కు చాలా సమయం ఉంది. దీంతో బీసీసీఐ క్రికెటర్లకు మూడు వారాల విరామం ప్రకటించింది. కాగా, అశ్విన్‌కు అనుకోకుండా సర్రే జట్టులో ఆడే అవకాశం వచ్చింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు ముందు అశ్విన్‌కు మంచి ప్రాక్టీస్‌ దొరకనుంది. గతంలో నాటింగ్హమ్‌షైర్‌, వొర్సెస్టర్‌షైర్‌ కౌంటీలకు కూడా అశ్విన్ ఆడాడు.

Also Read:

Viral Video: చిన్నారి అభిమానానికి సెర్బియా దిగ్గజం ఫిదా… బహుమతిగా ఏమిచ్చాడో తెలుసా?

India tour of Sri Lanka: ఇట్స్ అఫీషియల్.. ఐదు రోజులు ఆలస్యంగా సిరీస్ రీ-స్టార్ట్.. షెడ్యూల్ ఇదే.!

PM Narendra Modi: హర్లీన్ డియోల్ క్యాచ్‌కు ప్రధాని మోడీ ఫిదా.. అసాధారణమంటూ ప్రశంస