AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs KKR : కేకేఆర్ టార్గెట్ 143.. తడబడ్డ బ్యాటింగ్ ఆర్డర్.. ఢిల్లీ బౌలర్లైనా అద్భుతం చేస్తారా?

DC vs KKR : కోల్‌కతా బౌలర్ల ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ 142 పరుగులకే పరిమితమైంది. నిస్సాంక హాఫ్ సెంచరీ చేసినా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. కేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, కేమరూన్ గ్రీన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టారు.

DC vs KKR :  కేకేఆర్ టార్గెట్ 143.. తడబడ్డ బ్యాటింగ్ ఆర్డర్.. ఢిల్లీ బౌలర్లైనా అద్భుతం చేస్తారా?
Dc Vs Kkr
Rakesh
|

Updated on: May 08, 2026 | 9:20 PM

Share

DC vs KKR : ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న 51వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే నిర్ణయం సరైందేనని బౌలర్లు నిరూపించారు. హోమ్ గ్రౌండ్‌లో చెలరేగుతారనుకున్న ఢిల్లీ బ్యాటర్లు కేకేఆర్ ధాటికి పెవిలియన్ కు క్యూ కట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ కేవలం 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, పథుమ్ నిస్సాంక మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అయితే 14 బంతుల్లో 23 పరుగులు చేసిన కేఎల్ రాహుల్‌ను కార్తీక్ త్యాగి అవుట్ చేయడంతో ఢిల్లీ పతనం మొదలైంది. మరోవైపు నిస్సాంక నిలకడగా ఆడి 29 బంతుల్లో 50 పరుగులు (హాఫ్ సెంచరీ) చేసినప్పటికీ, అతనికి ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు.

క్యూ కట్టిన మిడిలార్డర్ బ్యాటర్లు

నిస్సాంక అవుట్ అయిన తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్ కుప్పకూలింది. నితీష్ రాణా (8), సమీర్ రిజ్వీ (3), ట్రిస్టన్ స్టబ్స్ (2) వంటి కీలక బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కేకేఆర్ బౌలర్ల కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ కు ఢిల్లీ బ్యాటర్లు సమాధానం చెప్పలేకపోయారు. దీంతో 11 ఓవర్లకే సగం టీమ్ పెవిలియన్ కు చేరింది.

ఆశుతోష్ శర్మ పోరాటం

చివర్లో ఆశుతోష్ శర్మ 28 బంతుల్లో 39 పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ 22 బంతుల్లో 11 పరుగులు చేసినప్పటికీ, కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోవడం గమనార్హం. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, కేమరూన్ గ్రీన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టారు.

చేజింగ్‌కు సిద్ధమైన కేకేఆర్

143 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఇది సులభమైన లక్ష్యమే అని చెప్పాలి. అయితే ఢిల్లీ బౌలర్లు మిచెల్ స్టార్క్, లుంగీ ఎన్గిడి ప్రారంభంలో వికెట్లు తీస్తే మ్యాచ్ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే కేకేఆర్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us