నన్ను వాళ్లు అడగలేదు.. అందుకే ఆ వీడియోలో నేను లేను: ఓ అభిమాని ప్రశ్నకు డేవిడ్ వార్నర్ సమాధానం

David Warner: సోషల్ మీడియాలో ఆరెంజ్ ఆర్మీ షేర్ చేసిన వీడియోలో వార్నర్ కనిపించలేదు. వార్నర్ లేకపోవడంపై అభిమానులు ప్రశ్నలమీద ప్రశ్నలు సంధిస్తున్నారు.

నన్ను వాళ్లు అడగలేదు.. అందుకే ఆ వీడియోలో నేను లేను: ఓ అభిమాని ప్రశ్నకు డేవిడ్ వార్నర్ సమాధానం
David Warner

Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2021 మాయని మచ్చలా తయారైంది. కెప్టెన్సీ పదవి పోయింది, అనంతరం టీం నుంచి కూడా స్థానం కోల్పాయాడు. దీంతోపాటు సన్‌రైజర్స్ టీం మేనేజ్‌మెంట్ కూడా వార్నర్‌‌తో దారుణంగా ప్రవర్తించిన తీరు కూడా దారుణంగా ఉంది. వార్నర్ తన మొదటి ఆరు గేమ్‌లలో ఒక విజయాన్ని మాత్రమే సాధించడంతో SRH కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్‌ను నియమించారు. కోవిడ్ -19 కారణంగా టోర్నమెంట్ వాయిదా వేయడానికి ముందు SRH టీం ఏడవ గేమ్ ప్లేయింగ్ XI నుంచి తప్పుకున్నాడు. UAE లెగ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మొదటి రెండు ఆటల్లో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ ప్టేయింగ్‌ XIలోకి తిరిగి వచ్చాడు. అయితే ఆ తరువాత మళ్లీ టీం నుంచి డ్రాప్ అయ్యాడు.

టోర్నమెంట్ తరువాతి దశలో వార్నర్ మిగిలిన స్క్వాడ్‌తో స్టేడియానికి వెళ్లలేకపోయాడు. ఎస్‌ఆర్‌హెచ్ మాజీ కెప్టెన్‌తో ఫ్రాంఛైజీ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌‌కు కూడా కోపం తెప్పించింది. శనివారం ఎస్‌ఆర్‌హెచ్‌ టీం ఐపీఎల్ 2021 లీగ్ దశ ముగిసిన తర్వాత అభిమానుల కోసం వీడ్కోలు వీడియోను విడుదల చేసింది. ఈ ఏడాది ప్లేఆఫ్స్‌ చేరుకోవడంలో విఫలమయింది.

సోషల్ మీడియాలో ఆరెంజ్ ఆర్మీ షేర్ చేసిన వీడియోలో వార్నర్ కనిపించలేదు. వార్నర్ లేకపోవడంపై అభిమానులు ప్రశ్నలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ మేరకు ఓ అభిమాని ఒకరు వార్నర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేసి వీడ్కోలు వీడియోలో ఎందుకు లేరంటూ ఓ ప్రశ్న అడిగారు. ఆస్ట్రేలియన్ స్టార్ స్పందిస్తూ వీడియోలో మాట్లాడమని తనను అడగలేదంటూ పేర్కొన్నాడు.

ఐపీఎల్ చరిత్రలో ఎస్‌ఆర్‌హెచ్ అత్యుత్తమ రన్నర్ అయిన వార్నర్, ఈ సీజన్‌లో జట్టు కోసం కేవలం ఎనిమిది మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయితే కేవలం 185 పరుగులు మాత్రమే చేశాడు. 2016లో ఎస్‌ఆర్‌హెచ్‌ని ఐపీఎల్‌ టైటిల్‌కి నడిపించిన ఏకైక కెప్టెన్ వార్నర్. మెగా వేలానికి ముందు వార్నర్‌ ఫ్రాంచైజీని విడుదల చేస్తుందో లేదో చూడాలి. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ఈ ఏడాది ప్లేఆఫ్స్‌లో విఫలం కావడంతో.. మొత్తం జట్టును పునరుద్ధరించాలని చూస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by SunRisers Hyderabad (@sunrisershyd)

Also Read: IPL 2021, DC vs CSK Preview, Records: 40 ఏళ్ల గురువుపై 24 ఏళ్ల శిష్యుడి పోరాటం.. ఇరుజట్ల బలాలు, రికార్డులు ఎలా ఉన్నాయంటే?

IPL 2021, DC vs CSK, 1st Qualifer, Live Streaming: తొలి క్వాలిఫయర్‌లో టాప్‌ టీంల పోరాటం.. మ్యాచ్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu