ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది.. అంతేకానీ ఎవరిని గుడ్డిగా అనుసరించనని చెబుతున్న క్రికెటర్..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న గులాబి టెస్ట్‌లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగిపోయాడు. 55 పరుగులిచ్చి ఏకంగా 4 కీలక వికెట్లు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న గులాబి టెస్ట్‌లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగిపోయాడు. 55 పరుగులిచ్చి ఏకంగా 4 కీలక వికెట్లు పడగొట్టిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా తన బౌలింగ్ శైలి గురించి కొన్ని విషయాలను వెల్లడించాడు. సహచరులు, పోటీదారులను చూసి నేర్చుకునేందుకు తానెప్పుడు సిద్దంగా ఉంటానిని ప్రకటించాడు. అయితే వారిని గుడ్డిగా అనుసరించనని మాత్రం చెప్పాడు.
ఓ ఛానెల్ నిర్వాహకుడు అడిగిన ప్రశ్నకు రవిచంద్రన్ ధీటైన సమాధానం చెప్పాడు. ఆస్ట్రేలియాలో బౌలింగ్ చేస్తున్నప్పుడు నేథల్ లైయన్, ఇంగ్లడ్‌లో ఆడుతున్నప్పుడు మొయిన్ అలీ నుంచి ఏమైనా నేర్చుకుంటారా అని ప్రశ్నించాడు. దీనికి రవిచంద్రన్ బదులిస్తూ ఆస్ట్రేలియాలో ఆడుతున్నప్పుడు స్టీవ్ స్మిత్, ఇంగ్లాండ్‌లో ఆడుతున్నప్పుడు జోరూట్, అలిస్టర్ కుక్ మాదిరిగా బ్యాటింగ్ చేస్తారా అని ఏ బ్యాట్స్‌మెన్‌నైనా అడగగలరా అని ప్రశ్నించాడు. దీంతో అతడు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. కొన్నిసార్లు పోలికలు అనేవి కొంపముంచుతాయని, అందుకే తాను పెద్దగా పట్టించుకోనని తెలిపాడు. ఉత్తమమైన ఆటగాళ్ల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందని దానిని తాను కచ్చితంగా గ్రహిస్తానని చెప్పాడు కానీ ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుందని, తన శైలిలో తాను ప్రయత్నిస్తానని బదులిచ్చాడు. ప్రతిసారి జట్టు విజయం కోసం ప్రయత్నించడమే తన అంతిమ లక్ష్యమని వెల్లడించాడు.