అడిలైడ్‌లో అశ్విన్ మాయాజాలం.. ఆధిక్యంలో భారత్.. రసవత్తరంగా మారుతున్న డే/నైట్ టెస్ట్..

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. 233/6 ఓవర్ నైట్ స్కోర్‌తో..

అడిలైడ్‌లో అశ్విన్ మాయాజాలం.. ఆధిక్యంలో భారత్.. రసవత్తరంగా మారుతున్న డే/నైట్ టెస్ట్..
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 18, 2020 | 6:47 PM

India Vs Australia 2020: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. 233/6 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా మరో 11 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. భారత్ బౌలర్ల ధాటికి పేక మేడలా కుప్పకూలింది. 79 పరుగులకే మొదటి ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్(73*) ఒంటరి పోరాటం చేయడంతో 191 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌కు ఆలౌట్ అయింది. ఆసీస్ పతనంలో రవిచంద్రన్ అశ్విన్‌ (4/55) కీలక పాత్ర పోషించగా.. అతడికి ఉమేశ్ యాదవ్ (3/40), జస్ప్రీత్‌ బుమ్రా (2/52)లు చక్కటి సహకారాన్ని అందించారు.

ఇక 53 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 6 ఓవర్లకు ఒక వికెట్ నష్టపోయి 9 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా(4) మరోసారి విఫలమయ్యాడు. ప్రస్తుతం నైట్ వాచ్‌మాన్ బుమ్రా(0), మయాంక్ అగర్వాల్(5) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్‌కు ఒక వికెట్ దక్కింది.

Also Read:

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి ఉచిత బస్సు పాసులు..

‘చాయ్’ ప్రియులకు అలెర్ట్.. పేపర్ కప్పుల్లో తాగుతున్నారా.! ఆరోగ్యానికి ఇబ్బందేనంటున్న పరిశోధకులు..

‘మాస్టర్’ తెలుగు టీజర్ వచ్చేసింది.. విజయ్ స్క్వేర్ ఫైట్ సీన్స్ ఫ్యాన్స్‌కు పండగే..

విద్యార్థులకు మోదీ సర్కార్ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా.? వైరల్ అవుతున్న మెసేజ్.. వివరణ ఇచ్చిన కేంద్రం..