‘చాయ్’ ప్రియులకు అలెర్ట్.. పేపర్ కప్పుల్లో తాగుతున్నారా.! ఆరోగ్యానికి ఇబ్బందేనంటున్న పరిశోధకులు..
భాగ్యనగరంలో ఎక్కడ చూసినా అందరూ కూడా పేపర్ కప్పుల్లో టీ తాగుతూ దర్శనమిస్తుంటారు. పింగాణీ కప్పులను వినియోగించే టీ స్టాల్ నిర్వాహకులు సైతం..

Tea in Paper Cups: భాగ్యనగరంలో ఎక్కడ చూసినా అందరూ కూడా పేపర్ కప్పుల్లో టీ తాగుతూ దర్శనమిస్తుంటారు. పింగాణీ కప్పులను వినియోగించే టీ స్టాల్ నిర్వాహకులు సైతం విరివిగా పేపర్ కప్పులనే ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పేపర్ (డిస్పోజబుల్) కప్పులు వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని ఇటీవల ఖరగ్‌పుర్ ఐఐటీ పరిశోధకులు తేల్చి చెప్పేశారు.
”పేపర్ కప్పుల్లో వేడి ద్రవం పోసినప్పుడు ఆ పేపర్‌లోని మైక్రోప్లాస్టిక్ కణాలు, ఇతర ప్రమాదకర రేణువులు ద్రవంలో మిళితమవుతాయన్నారు. 85-90 డిగ్రీల సెల్సియస్ వేడి ఉండే 100 ఎంఎల్ వేడి ద్రవంలోకి పేపర్ కప్పు ద్వారా 25 వేల మైక్రోప్లాస్టిక్ రేణువులు మనలోకి రిలీజవుతాయని.. స్టీల్, పింగాణీ గకప్పుల్లో టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.
కాగా, హైదరాబాద్ నగరంలో చాయ్ ప్రియులు ఎక్కువ మంది ఉన్నారు. సుమారు 10 వేలకు పైగా ఉన్న స్టాళ్ళలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రద్దీ ఉంటుంది. సాధారణ హోటళ్లలో నిత్యం 2 వేల కప్పుల టీ అమ్ముడవుతుండగా.. కేఫ్ లలో రోజూ 3 వేల కప్పుల టీని జనాలు గుతుక్కుమనిపిస్తారు. లాక్ డౌన్ ముందు పింగాణీ కప్పుల వినియోగమే ఉండగా.. ఇప్పుడు డిస్పోజబుల్ కప్పుల వాడకం ఎక్కువైపోయింది.
Also Read:
బిగ్ బాస్ 4 ఓటింగ్: అగ్రస్థానంలో అరియానా.. రెండో స్థానంలో అభిజిత్..!
పోలీసులను ఆశ్రయించిన మోనాల్ గజ్జర్.. అభిజిత్ ఫ్యాన్స్‌పై ఫిర్యాదు..
”మాయా స్తంభం పోయే.. రాక్షసుడి స్టాట్యూలు వచ్చే”.. వైరల్ ఫోటోలు..