”మాయా స్తంభం పోయే.. రాక్షసుడి స్టాట్యూలు వచ్చే”.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ ఫోటోలు..

ఒక చోట మాయమై మరో చోట హాయ్ అంటున్న ‘మోనోలిత్'(ఏకశిల) ప్రపంచానికి పెద్ద మిస్టరీగా మారింది అని అనుకునేలోపు తాజాగా వింత స్టాట్యూలు..

''మాయా స్తంభం పోయే.. రాక్షసుడి స్టాట్యూలు వచ్చే''.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ ఫోటోలు..
Follow us

|

Updated on: Dec 16, 2020 | 9:51 PM

Mysterious Statue: ఒక చోట మాయమై మరో చోట హాయ్ అంటున్న ‘మోనోలిత్'(ఏకశిల) ప్రపంచానికి పెద్ద మిస్టరీగా మారింది అని అనుకునేలోపు తాజాగా వింత స్టాట్యూలు మనుషులను పలకరిస్తున్నాయి. కెనడాలోని టొరంటో హైపార్కులో విచిత్రమైన స్టాట్యూలు వెలిశాయి. మట్టి, సిమెంట్, చెక్కతో రూపొందించిన ఆ బొమ్మలు చూడ్డానికి అచ్చం రాక్షసుడి రూపంలో ఉన్నాయి. భయంకరంగా దర్శనమిస్తున్న ఈ స్టాట్యూలకు చేతులు, కళ్లు, కొమ్ములు ఉండగా.. వీటిని చూసేందుకు జనాలు వేల సంఖ్యలో భారీగా తరలి వస్తున్నారని అక్కడి మీడియా పేర్కొంది. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, గత కొద్దిరోజుల్లో ‘మోనోలిత్’ను అమెరికా, యూరోప్, పోలాండ్ దేశాల్లోని పలు ప్రదేశాల్లో జనాలు గుర్తించారు. మొదట అమెరికాలో దర్శనమిచ్చిన ఈ వింత స్తంభం.. ఆ తర్వాత అక్కడ నుంచి మాయమై రొమానియాలో.. తర్వాత బ్రిటన్‌లో ప్రత్యక్షమైంది. అసలు ఈ వింత స్తంభం ఎక్కడ నుంచి వచ్చింది.? లేదా ఎవరైనా తీసుకొచ్చారా.? అనేది తెలియక శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు.