AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నను ఫాలో అవుతున్న యంగ్ హీరో.. మొదటిసినిమా కంటే ముందే ప్రేక్షకుల ముందుకు రెండో సినిమా.?

మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన' సినిమాతో ఈ కుర్రహీరో పరిచయం కాబోతున్నాడు. సుకుమార్ రైటింగ్స్ లో నూతన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది.

అన్నను ఫాలో అవుతున్న యంగ్ హీరో.. మొదటిసినిమా కంటే ముందే ప్రేక్షకుల ముందుకు రెండో సినిమా.?
Rajeev Rayala
|

Updated on: Dec 18, 2020 | 7:07 PM

Share

మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన’ సినిమాతో ఈ కుర్రహీరో పరిచయం కాబోతున్నాడు. సుకుమార్ రైటింగ్స్ లో నూతన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో కృతి శట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. లాక్ డౌన్ సమయంలో ఈ మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ గ్యాప్ లోనే మరో సినిమా చేసాడు వైష్ణవ్ తేజ్. క్రిష్ దర్శకత్వంలో ఓ గ్రామీణ నేపధ్య కథతో సినిమా చేసాడు వైష్ణవ్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తయ్యి విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు ‘కొండపోలం’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను అనుకుంటున్నారు. అయితే ఉప్పెన సినిమా కంటే ముందే ‘కొండపోలం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ‘ఉప్పెన’ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలనీ చూస్తున్నారట మేకర్స్ . దాంతో ఈలోగా ‘కొండపోలం’ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. అయితే ‘కొండపోలం’సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారని తెలుస్తుంది.. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక సాయి ధరమ్ తేజ్ విషయంలోనూ ఇలానే జరిగింది. మొదటిసినిమా ‘రేయ్’ కంటే ముందు రెండో సినిమా ‘పిల్లనువ్వులేని జీవితం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..