విరుష్క జంటను ఆస్ట్రేలియాకు ఆహ్వానించిన బ్రెట్‌లీ.. ఆసీస్‌లో బిడ్డకు జన్మనివ్వాలని కోరిన మాజీ బౌలర్

అనుష్క శర్మ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోన్న విషయం తెలిసిందే. జనవరిలో ఆమె ప్రసవించే అవకాశం ఉంది. దాంతో కోహ్లీ తొలి టెస్టు తర్వాత కోహ్లీ భారత్‌కు వచ్చేస్తున్నాడు.

విరుష్క జంటను ఆస్ట్రేలియాకు ఆహ్వానించిన బ్రెట్‌లీ.. ఆసీస్‌లో బిడ్డకు జన్మనివ్వాలని కోరిన మాజీ బౌలర్
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 19, 2020 | 7:37 AM

అనుష్క శర్మ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోన్న విషయం తెలిసిందే. జనవరిలో ఆమె ప్రసవించే అవకాశం ఉంది. దాంతో కోహ్లీ తొలి టెస్టు తర్వాత కోహ్లీ భారత్‌కు వచ్చేస్తున్నాడు. ఇప్పటికే బీసీసీ అతడికి సెలవలు కూడా మంజూరు చేసింది. దాంతో జట్టుకు రహానే సారథ్యం వహిస్తున్నాడు. అయితే విరుష్క జంటను బ్రెట్‌లీ ఆస్ట్రేలియాకు ఆహ్వానించాడు. విరుష్క జంట తమ బిడ్డను ఆస్ట్రేలియాలో కనాలని కోరాడు. ఇటీవల బ్రెట్‌లీ మీడియాతో మాట్లాడుతూ..’కోహ్లీ, మీకు ఇష్టమైతే ఆస్ట్రేలియాలో మీ బిడ్డకు మేం స్వాగతం చెబుతాం. మేం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీకు మగ బిడ్డ పుట్టినా.. ఆడబిడ్డ పుట్టినా మాకు సంతోషమే’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అనుష్క ఇండియాలోనే ఉంది. మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తోంది. ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్న గులాబి పోరులో టీమ్‌ఇండియా అద్భుతంగా రాణిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసిన భారత్. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కంగారూలను 191కే కట్టడిచేసింది. రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌ తమ బౌలింగ్‌తో కంగారులను కంగారుపెట్టించారు.