ముగ్గురు డకౌట్.. పేక మేడలా కూలిన భారత్ టాప్ ఆర్డర్.. తొలి టెస్ట్‌పై పట్టు బిగించిన ఆస్ట్రేలియా..

4..9..2..0..4..0..4..0..0.. ఇది మొబైల్ నెంబర్ అనుకుంటే పొరపాటే.! ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ..

ముగ్గురు డకౌట్.. పేక మేడలా కూలిన భారత్ టాప్ ఆర్డర్.. తొలి టెస్ట్‌పై పట్టు బిగించిన ఆస్ట్రేలియా..
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 19, 2020 | 10:49 AM

India Vs Australia 2020: 4..9..2..0..4..0..4..0..0.. ఇది మొబైల్ నెంబర్ అనుకుంటే పొరపాటే.! ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ చేసిన స్కోర్లు ఇవి. 62 పరుగుల ఆధిక్యంతో మూడో రోజు ఆట ఆరంభించిన భారత్.. ఆసీస్ పేస్ బౌలింగ్‌కు పేక మేడలా కూలిపోయింది. టీమిండియా బ్యాట్స్‌మెన్లు బుమ్రా(2), మయాంక్(9), పుజారా(0), కెప్టెన్ విరాట్ కోహ్లీ(4), రహానే(0), అశ్విన్ (0), సాహా(4) ఒక్కొక్కరిగా వరుసపెట్టి పెవిలియన్‌కు క్యూ కట్టారు.

ఆసీస్ పేస్ బౌలర్లు ప్యాట్ కమ్మిన్స్, జోష్ హాజెల్‌వుల్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ మొదటి వికెట్ 7 రన్స్‌కు కోల్పోగా.. ఆ తర్వాత 21 పరుగుల వ్యవధిలో 7 కీలక వికెట్లను కోల్పోయింది. దీనితో ఆస్ట్రేలియా మొదటి టెస్టుపై పట్టు సాధించింది. మేజిక్ జరిగితే తప్ప భారత్ విజయం సాధిస్తుందన్న ఆశలు కనిపించట్లేదు. కేవలం 79 పరుగుల లీడ్‌తో భారత్ 19 ఓవర్లకు 26/8 పరుగులు చేసింది. క్రీజులో విహారి(3), ఉమేష్ (0) ఉన్నారు. కాగా, అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 244, ఆస్ట్రేలియా 191 రన్స్‌కు చేశాయి.

Also Read:

సాధారణ రైళ్ల రాకపోకల తిరిగి ప్రారంభమయ్యేది ఎప్పుడంటే.? కీలక ప్రకటన చేసిన రైల్వే శాఖ.!!

నా కెరీర్‌కు బిగ్ బాస్ వల్ల ఎలాంటి ఉపయోగం జరగలేదు.. వైరల్ అవుతున్న పునర్నవి షాకింగ్ కామెంట్స్..

డేటింగ్ యాప్ మాయ.. కిలాడీ యువతుల నగ్న వీడియో కాల్.. అసలు కథంతా అప్పుడే జరిగింది.?

తెలంగాణలో స్కూళ్లు ప్రారంభమయ్యేది అప్పుడే.!! మూడు నెలలు తరగతులు.? పూర్తి వివరాలివే..