నా కెరీర్‌కు బిగ్ బాస్ వల్ల ఎలాంటి ఉపయోగం జరగలేదు.. వైరల్ అవుతున్న పునర్నవి షాకింగ్ కామెంట్స్..
పునర్నవి భూపాలం.. బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా ఈ నటి ప్రేక్షకులకు బాగా దగ్గరైందని చెప్పాలి. హౌస్‌లో ఈమె సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో నడిపిన..

Punarnavi Bhupalam Comments: పునర్నవి భూపాలం.. బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా ఈ నటి ప్రేక్షకులకు బాగా దగ్గరైందని చెప్పాలి. హౌస్‌లో ఈమె సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో నడిపిన లవ్ ట్రాక్ అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఇద్దరి క్రేజ్ అలాగే ఉంది. అయితే పునర్నవి భూపాలం మాత్రం తాజాగా బిగ్ బాస్‌పై సంచలన కామెంట్స్ చేసింది. తన కెరీర్‌పై బిగ్ బాస్ పెద్దగా ప్రభావం చూపించలేదని.. షోకు వెళ్లడం ద్వారా తనకు అవకాశాలు పరంగా పెద్ద తేడా ఏం కనిపించలేదని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
‘నా కెరీర్‌కు బిగ్ బాస్ షో ఎలాంటి హెల్ప్ చేయలేదు. సోషల్ ప్రొఫైల్ పెంచుకోవడంలో ఉపయోగపడలేదు. కానీ ఆ షోతో జరిగిన ఒకే ఒక్క మంచి ఏంటంటే.? ఫ్యాన్స్‌కు మరింత దగ్గర కావడమే.!’ అని పునర్నవి పేర్కొంది. కాగా, పునర్నవి నటించిన వెబ్ సిరీస్ ‘కమిట్‌మెంటల్’ ఆహా ఓటీటీలో అలరిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన దివి, మోనాల్ గజ్జర్‌కు బిగ్ బాస్ కారణంగా పలు ఆఫర్స్ తలుపు తడుతున్న సంగతి తెలిసిందే.
Also Read:
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి ఉచిత బస్సు పాసులు..
‘చాయ్’ ప్రియులకు అలెర్ట్.. పేపర్ కప్పుల్లో తాగుతున్నారా.! ఆరోగ్యానికి ఇబ్బందేనంటున్న పరిశోధకులు..
‘మాస్టర్’ తెలుగు టీజర్ వచ్చేసింది.. విజయ్ స్క్వేర్ ఫైట్ సీన్స్ ఫ్యాన్స్‌కు పండగే..