తెలంగాణలో స్కూళ్లు ప్రారంభమయ్యేది అప్పుడే.!! మూడు నెలలు తరగతులు.? పూర్తి వివరాలివే..

తెలంగాణాలో పాఠశాలల పున:ప్రారంభానికి విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే సంక్రాంతి తర్వాత నుంచి స్కూల్స్ రీ-ఓపెన్..

తెలంగాణలో స్కూళ్లు ప్రారంభమయ్యేది అప్పుడే.!! మూడు నెలలు తరగతులు.? పూర్తి వివరాలివే..
Follow us

|

Updated on: Dec 18, 2020 | 4:09 PM

Telangana Schools Re-Open: తెలంగాణాలో పాఠశాలల పున:ప్రారంభానికి విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే సంక్రాంతి తర్వాత నుంచి స్కూల్స్ రీ-ఓపెన్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు పంపించింది. మొదటిగా 9,10 తరగతుల విద్యార్థులకు పాఠశాలలో క్లాసులు ప్రారంభించాలని.. ఆ తర్వాత దశల వారీగా మిగతా క్లాసులు స్టార్ట్ చేయనున్నారు.

సంక్రాంతి సెలవులు తర్వాత స్కూల్స్ తెరిచినా పదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షలకు మూడు నెలలు సమయం ఉంటుంది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలవులు వరుసపెట్టి ఉండటంతో.. ఈ నెలాఖరు దాకా స్కూల్స్ తెరవకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి దాకా దేశంలోని ఏడు రాష్ట్రాల్లో స్కూల్స్, విద్యాసంస్థలు తిరిగి తెరుచుకున్న విషయం విదితమే.

కాగా, పదో తరగతి పరీక్షల్లో పేపర్లు కుదించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 11గా ఉన్న ప్రశ్నా పత్రాల సంఖ్యను ఆరుకు కుదించాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వచ్చే ఏడాది(2021) ఏప్రిల్, మే నెలల్లో వార్షిక పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్న విద్యాశాఖ ఈసారి మాత్రం ఒక్కో సబ్జెక్టుకు ఒక్క ప్రశ్న పత్రం మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టింది.

Also Read:

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి ఉచిత బస్సు పాసులు..

‘చాయ్’ ప్రియులకు అలెర్ట్.. పేపర్ కప్పుల్లో తాగుతున్నారా.! ఆరోగ్యానికి ఇబ్బందేనంటున్న పరిశోధకులు..

‘మాస్టర్’ తెలుగు టీజర్ వచ్చేసింది.. విజయ్ స్క్వేర్ ఫైట్ సీన్స్ ఫ్యాన్స్‌కు పండగే..

విద్యార్థులకు మోదీ సర్కార్ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా.? వైరల్ అవుతున్న మెసేజ్.. వివరణ ఇచ్చిన కేంద్రం..