డేటింగ్ యాప్ మాయ.. కిలాడీ యువతుల నగ్న వీడియో కాల్.. అసలు కథంతా అప్పుడే జరిగింది.?

బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ డేటింగ్‌ యాప్ ఉచ్చులో పడి ఏకంగా రూ.16 లక్షలు స‌మ‌ర్పించుకున్నాడు. దీంతో అత‌డు సైబర్‌ క్రైమ్‌...

డేటింగ్ యాప్ మాయ.. కిలాడీ యువతుల నగ్న వీడియో కాల్.. అసలు కథంతా అప్పుడే జరిగింది.?
Follow us

|

Updated on: Dec 18, 2020 | 6:16 PM

Techie loses Rs 16 lakh: ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారాయి. వీటిపై యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. డేటింగ్ యాప్స్‌లో యువత తమ వ్యక్తిగత సమాచారంతో పాటు ఫోటోలను సైతం అప్‌లోడ్ చేస్తూ ఎన్నో రకాల చిక్కుల్లో పడుతున్నారు. ఇప్పటికే ఈ ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్‌ మోజులో పడి అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ డేటింగ్‌ యాప్ ఉచ్చులో పడి ఏకంగా రూ.16 లక్షలు స‌మ‌ర్పించుకున్నాడు. దీంతో అత‌డు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. డిసెంబర్ 3వ తేదీన డేటింగ్ యాప్ ద్వారా బెంగళూరుకు చెందినటెకీకి శ్వేతా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. డిజిటల్ పేమెంట్ వాలెట్ ద్వారా తనకు రూ. 2 వేలు పంపాలని ఆమె కోరింది. డబ్బులు పేమెంట్ చేసేందుకు తన ఫ్రెండ్ నిఖిత నెంబర్‌ను అతడికి ఇచ్చింది. ఇక కొద్దిసేపటి తర్వాత టెకీకి నిఖిత నగ్నంగా వీడియో కాల్ చేసింది. అతడు కూడా ఆమెతో నగ్నంగానే వీడియో చాట్ చేశాడు.

ఈ వీడియో కాల్‌ను ఆమె రికార్డు చేసింది. అనంతరం ఆ యువతి ఈ వీడియోను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడింది. ఆమెతో పాటు ప్రీతి అగర్వాల్, షెరీన్ అనే మరో ఇద్దరు యువతులు కూడా టెకీని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. తాము అడిగిన డబ్బు ఇవ్వాలని.. లేదంటే వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామంటూ బెదిరించసాగారు. దీనితో ఆ కిలాడీ యువతులు అతడి దగ్గర నుంచి డిసెంబర్ 3-13 మధ్య 10 రోజుల్లో ఆన్లైన్ బ్యాంకింగ్, గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా సుమారు రూ. 16 లక్షలను దోచేశారు. అప్పటికీ వారి దగ్గర నుంచి బెదిరింపులు ఆగకపోవడంతో డిసెంబర్ 14న టెకీ పోలీసులను ఆశ్రయించాడు.

Also Read:

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి ఉచిత బస్సు పాసులు..

‘చాయ్’ ప్రియులకు అలెర్ట్.. పేపర్ కప్పుల్లో తాగుతున్నారా.! ఆరోగ్యానికి ఇబ్బందేనంటున్న పరిశోధకులు..

‘మాస్టర్’ తెలుగు టీజర్ వచ్చేసింది.. విజయ్ స్క్వేర్ ఫైట్ సీన్స్ ఫ్యాన్స్‌కు పండగే..

విద్యార్థులకు మోదీ సర్కార్ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా.? వైరల్ అవుతున్న మెసేజ్.. వివరణ ఇచ్చిన కేంద్రం..